Royal Enfield: వచ్చే ఏడాదిలో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ నుంచి రానున్న బైక్స్‌ ఇవే..

Upcoming Royal Enfield: రాయల్‌ ఎన్ఫీల్డ్‌ వచ్చే ఏడాదిలో మార్కెట్లోకి కొన్న మోటార్‌ సైకిళ్లు రానున్నాయి. వాటిపై ఓ లుక్కేయండి..

Published : 29 Nov 2023 19:48 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ (Royal Enfield) వచ్చే ఏడాదిలో పలు కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకురానుంది. ముఖ్యంగా 650 సీసీ సెగ్మెంట్‌పై కంపెనీ దృష్టి సారించనుంది. మరోవైపు తన మొదటి విద్యుత్‌ వాహనాన్నీ తీసుకొచ్చేందుకు కూడా సన్నద్ధమవుతోంది. ఇంతకీ వచ్చే ఏడాదిలో అత్యాధునికి ఫీచర్లతో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ తీసుకురానున్న మోటార్‌ సైకిళ్లపై లుక్కేద్దాం..

షాట్‌గన్‌ 650

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ షాట్‌గన్‌ 650 (Royal Enfield Shotgun 650) మోటోవెర్స్‌ ఎడిషన్‌ బైక్‌ను ఇటీవల విడుదల చేసింది. లిమిటెడ్‌ ఎడిషన్‌గా తీసుకొస్తున్న ఈ స్పెషల్‌ ఎడిషన్‌ బైక్‌ ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.4.25 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. వచ్చే ఏడాది నుంచి రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేయనుంది. 650cc సెగ్మెంట్‌లో కంపెనీ తీసుకురానున్న నాలుగో బైక్ ఇది. నావిగేషన్‌, బ్లూటూత్‌ కనెక్టివిటీ, యూఎస్‌బీ ఛార్జింగ్‌ పోర్ట్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. ముందు, వెనుక డిస్క్‌ బ్రేక్స్‌, డ్యుయల్‌-ఛానల్ ABS కూడా ఉంది.

2024లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కుంగుబాటు.. ఓఈసీడీ అంచనా!

స్క్రాంబ్లర్‌ 650

650cc ఇంజిన్‌ సెగ్మెంట్‌లో రాయల్‌ ఎన్ఫీల్డ్‌ తీసుకొస్తున్న ఐదో మోటార్‌ సైకిల్‌ స్క్రాంబ్లర్‌ 650 (Royal Enfield Scrambler 650). ఇప్పటికే అనేక సార్లు టెస్టింగ్‌ చేసిన ఈ బైక్‌ని వచ్చే ఏడాది చివరి నాటికి మార్కెట్‌లోకి తీసుకొని రావాలని కంపెనీ యోచిస్తోంది. స్పోక్స్‌ వీల్స్‌, డ్యుయల్‌ రియర్‌ షాక్స్‌, డ్యుయల్‌ పర్పస్‌ టైర్లతో ఈ ద్విచక్ర వాహనం రానుంది.

స్క్రామ్ 450

రాయల్ ఎన్‌ఫీల్డ్‌ మరో ద్విచక్ర వాహనం స్క్రామ్‌ 450. హిమాలయన్‌ మాదిరిగానే.. 40-హార్స్‌ పవర్ లిక్విడ్- కూల్డ్‌ ఇంజిన్‌తో ఈ మోటార్‌ సైకిల్‌ రానుంది. ఫీచర్ల గురించి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు.

క్లాసిక్‌ 650

రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ఇప్పటికే తీసుకొచ్చిన క్లాసిక్‌ 350 ద్విచక్ర వాహనం ఆదరణ పొందుతోంది. అదే పేరుతో 650cc ఇంజిన్‌తో కొత్త వాహనాన్ని తీసుకురానుంది. అదే రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 650 (Royal Enfield Classic 650). ఇప్పటికే ఈ బైక్‌ టెస్టింగ్‌ను పూర్తి చేసుకుంది. ఈ బైక్‌ కూడా వచ్చే సంవత్సరంలోనే తీసుకొచ్చేందుకు కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది.

మరోవైపు ఎంతో కాలంగా రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ నుంచి వచ్చే ఎలక్ట్రిక్‌ వాహనం కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది జరిగిన EICMA ఈవెంట్‌లో కంపెనీ తన మొదటి విద్యుత్ మోటార్‌ సైకిల్‌ ఎలక్ట్రిక్‌ హిమాలయన్‌ నమూనాను ఆవిష్కరించింది. అయితే ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ అడ్వెంచర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌ను 2025 నాటికి మార్కెట్‌లో లాంచ్‌ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని