Top 10 News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 25 Feb 2024 17:17 IST

1. గెలుపే లక్ష్యం.. అభ్యర్థుల పనితీరుపై ప్రతివారం సర్వే: చంద్రబాబు

తొలి జాబితాలో సీట్లు పొందిన అభ్యర్థుల పనితీరు సరిగా లేకుంటే మార్చేందుకు ఎంత మాత్రం వెనుకాడనని తెదేపా అధినేత చంద్రబాబు హెచ్చరించారు. 94 మంది అభ్యర్థులతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించిన చంద్రబాబు.. ప్రతి వారం పనితీరు పర్యవేక్షిస్తానని  స్పష్టం చేశారు. ఎన్నికల వరకు ప్రతివారం రోజులకు ఒక సర్వే చేయిస్తా.. తేడా వస్తే వేటు తప్పదని తేల్చిచెప్పారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. చంద్రబాబును కలిసిన ఆలపాటి రాజా

తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత ఆలపాటి రాజా ఆ పార్టీ అధినేత చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు. పొత్తులో భాగంగా తెనాలి సీటును జనసేన నేత నాదెండ్ల మనోహర్‌కు కేటాయించారు. ఈ నేపథ్యంలో తెనాలి తెదేపా ఇన్‌ఛార్జిగా ఉన్న ఆలపాటి రాజాను తన నివాసానికి పిలిపించుకొని చంద్రబాబు మాట్లాడారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కారు సర్వీసుకు వెళ్లింది.. మళ్లీ తిరిగొస్తుంది: కేటీఆర్‌

కాంగ్రెస్‌ పార్టీ పథకాలు ఎగ్గొట్టే కార్యక్రమాలు మొదలు పెట్టిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శించారు. ఆదివారం అచ్చంపేటలో జరిగిన నాగర్‌కర్నూల్‌ ఎంపీ నియోజకవర్గ సన్నాహక భేటీలో ఆయన మాట్లాడారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ఎప్పుడు?: హరీశ్‌రావు

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే తేదీని ప్రకటించాలని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. కార్మికులు, ఉద్యోగుల భద్రత, సంస్థ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని భారాస ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు వీలుగా.. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిందని లేఖలో పేర్కొన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. భారత్‌కు ఇంకా 152 పరుగులు అవసరం

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో (IND vs ENG) భారత్ పట్టు బిగించింది. పర్యటక జట్టును తక్కువ పరుగులకే కట్టడి చేసిన టీమ్‌ఇండియా.. టార్గెట్‌ వైపు దూసుకుపోతోంది. ఇంగ్లాండ్‌ నిర్దేశించిన 192 పరుగుల లక్ష్యఛేదనలో మూడో రోజు ఆట ముగిసేసమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. హసరంగాపై ఐసీసీ వేటు..

శ్రీలంక టీ20 కెప్టెన్‌ వనిందు హసరంగా (Wanindu Hasaranga)పై అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్ రెండు మ్యాచ్‌ల నిషేధాన్ని విధించింది. అఫ్గనిస్థాన్‌తో జరిగిన చివరి టీ20లో అంపైర్‌ లిండన్‌ హన్నిబల్‌పై వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు ఈ నిర్ణయం తీసుకుంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ‘రెరా’పై జీఎస్‌టీ మినహాయింపు.. త్వరలో క్లారిటీ!

స్థిరాస్థి నియంత్రణ సంస్థ (RERA) వస్తు సేవల పన్ను (GST) చెల్లించాల్సిన అవసరం లేదనే అంశంపై జీఎస్‌టీ  మండలి త్వరలో స్పష్టతనిస్తుందని ఓ ప్రభుత్వాధికారి తెలిపారు. రెరా పనితీరును సమీక్షించిన తర్వాత వారికి జీఎస్‌టీ వర్తించదనే నిర్ధరణకు వచ్చినట్లు పేర్కొన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. అరేబియా సముద్రంలో ప్రధాని డైవింగ్‌

కొన్ని నెలల వ్యవధిలోనే అరేబియా సముద్రంలో ప్రధాని మోదీ (PM Modi) మరోసారి డైవింగ్‌ చేశారు. ఆయన నేడు హిందువుల పురాతన ఆధ్యాత్మిక నగరమైన ద్వారకా వద్ద ప్రార్థనలు నిర్వహించారు. ఇందుకోసం ఆయన స్కూబా డైవింగ్‌ ద్వారా సముద్రజలాల్లోకి వెళ్లారు. ఒకప్పుడు శ్రీకృష్ణుడు ఈ నగరాన్ని పరిపాలించినట్లు హిందువులు బలంగా విశ్వసిస్తారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఇది రాహుల్‌ ప్రతీకార చర్య: జైవీర్‌ షెర్గిల్‌

గాంధీల కుటుంబం యూజ్‌ అండ్‌ త్రో విధానాన్ని పాటిస్తారని భాజపా నేత అమిత్‌ మాల్వియా(Amit Malviya) విమర్శించారు. అందుకే సీట్ల పంపకాల విషయంలో అహ్మద్‌ పటేల్‌కు కంచుకోటగా ఉన్న భరూచ్‌(Bharuch) సీటును ఆప్‌కు కట్టబెట్టారని దుయ్యట్టారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. మార్చిలో ఎన్నికల కోడ్‌.. ‘మన్‌ కీ బాత్‌’కు మూడు నెలల విరామం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రతి నెలా చివరి ఆదివారం దేశ ప్రజలనుద్దేశించి చేసే రేడియో ప్రసంగం ‘మన్‌ కీ బాత్‌’ (Mann ki Baat) ఎంతో ప్రజాదరణ పొందిన విషయం తెలిసిందే. వచ్చే రెండు, మూడు నెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) దృష్ట్యా ఈ కార్యక్రమానికి మూడు నెలల పాటు విరామం ఇస్తున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని