Top 10 News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 02 Mar 2024 17:13 IST

1. టీఎస్‌ ఆర్టీసీకి జాతీయ స్థాయిలో అవార్డుల పంట

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC)కి జాతీయ స్థాయిలో అవార్డుల పంట పండింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన అసోసియేషన్‌ ఆఫ్‌ స్టేట్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్టు అండర్‌ టేకింగ్స్‌ (ఏఎస్‌ఆర్‌టీయూ) ఏటా అందించే ప్రతిష్ఠాత్మక ఐదు నేషనల్‌ బస్‌ ట్రాన్స్‌పోర్టు ఎక్స్‌లెన్స్‌ అవార్డులు టీఎస్‌ఆర్టీసీని వరించాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్‌: సీఎం రేవంత్‌

అంగన్వాడీల ద్వారా గర్భిణీలు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. పౌష్టికాహారం దుర్వినియోగం కాకుండా చూడాలని స్పష్టం చేశారు. మహిళా, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమశాఖపై అధికారులతో సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్‌ హాజరు ఉండేలా చూడాలని ఆదేశించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఓడిపోయేందుకే వైఎస్‌ జగన్‌ ‘సిద్ధం’: చంద్రబాబు

నెల్లూరు జిల్లాలో వైకాపా కీలక నేత వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డి తెదేపాలో చేరారు. తెదేపా అధినేత చంద్రబాబు సమక్షంలో వారిద్దరూ పసుపు కండువా కప్పుకొన్నారు. ఇటీవల వైకాపాకు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ప్రభాకర్‌రెడ్డితో పాటు నెల్లూరుకు చెందిన పలువురు కార్పొరేటర్లు, సర్పంచులు తెదేపాలో చేరారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. హైదరాబాద్‌, సైబరాబాద్‌లో భారీగా సీఐల బదిలీ

హైదరాబాద్‌, సైబరాబాద్‌ కమిషనరేట్‌లలో భారీగా సీఐలు బదిలీ అయ్యారు. హైదరాబాద్‌లో 63 మందిని సీపీ శ్రీనివాస్‌రెడ్డి, సైబరాబాద్‌ పరిధిలో 41 మందిని కమిషనర్‌ అవినాష్‌ మహంతి బదిలీ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. తెలంగాణలో అన్ని ఎంపీ స్థానాల్లో గెలుస్తాం: బండి సంజయ్‌

ప్రజాహిత యాత్రకు అనూహ్య స్పందన లభిస్తోందని భాజపా ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. హుజూరాబాద్‌లోని శాయంపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో భాజపాకు 350కి పైగా సీట్లు వస్తాయని ధీమా వ్యక్తంచేశారు. తెలంగాణలో అన్ని ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటామనే నమ్మకం ఉందన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. అప్పుడు రేవంత్‌రెడ్డి ఫిర్యాదు.. ఇప్పుడు ఎమ్మెల్యే మల్లారెడ్డికి షాకిచ్చిన అధికారులు

మాజీ మంత్రి, మేడ్చల్‌ భారాస ఎమ్మెల్యే మల్లారెడ్డికి (Chamakura Malla Reddy) అధికారులు బిగ్ షాకిచ్చారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని హెచ్ఎండీఏ లేఅవుట్‌లో 2500 గజాల స్థలం ఆక్రమించి ఆయన నిర్వహిస్తున్న కాలేజీ కోసం రోడ్డు వేసుకున్నట్లు తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. దీనిపై గతంలో మేడ్చల్-మల్కాజిగిరి ఎంపీ, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఫిర్యాదు చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. మహిళల విజయానికి విలువకట్టేది ఇలాగేనా? సానియా మీర్జా పోస్ట్‌ వైరల్‌

సమాజంలో ఓ మహిళ సాధించిన విజయాన్ని ఎలా విలువ కడుతున్నారన్నదానిపై మనం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు భారత టెన్నిస్‌ (Tennis) స్టార్‌ సానియా మీర్జా (Sania Mirza). స్త్రీ, పురుష వివక్ష అనేది ఇంకా వ్యాప్తిలో ఉండటంపై విచారం వ్యక్తం చేశారు. మహిళల విజయంపై ఓ కంపెనీ చేసిన యాడ్‌పై స్పందిస్తూ ఆమె సోషల్‌మీడియాలో సుదీర్ఘ పోస్ట్‌ పెట్టారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. యాప్‌ల తొలగింపు సరికాదు.. గూగుల్‌ చర్యపై కేంద్రం

గూగుల్‌ ప్లేస్టోర్‌ (Google Play Store) వ్యవహారంపై కేంద్రం స్పందించింది. సర్వీసు ఫీజు చెల్లించని కారణంగా గూగుల్‌ తన ప్లేస్టోర్‌ నుంచి కొన్ని యాప్స్‌ను తొలగించడాన్ని తప్పుబట్టింది. టెక్‌, స్టార్టప్‌ కంపెనీలకు చెందిన యాప్స్‌ను తొలగించడం ఏమాత్రం సరికాదని ఐటీ, టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ పేర్కొన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. గంభీర్‌ బాటలో జయంత్‌ సిన్హా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దూరం

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయాలనుకోవడం లేదని భారతీయ జనతా పార్టీ (BJP) ఎంపీ జయంత్‌ సిన్హా (Jayant Sinha) పేర్కొన్నారు. ప్రత్యక్ష ఎన్నికల బాధ్యతల నుంచి తనను తప్పించాలని పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కోరారు. ఈవిషయాన్ని ఎక్స్‌ వేదికగా ప్రకటించారు. తూర్పు దిల్లీ ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ తన నిర్ణయాన్ని ప్రకటించిన కాసేపటికే జయంత్‌ సిన్హా కూడా అదేతరహా ప్రకటన చేయడం గమనార్హం.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ముంబయి పేలుళ్ల కీలక సూత్రధారి మృతి..

26/11 ముంబయి బాంబు పేలుళ్ల కీలక సూత్రధారి, లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) సీనియర్‌ కమాండర్‌ అజామ్‌ ఛీమా (Azam Cheema) గుండెపోటుతో మృతి చెందినట్లు సమాచారం. పాకిస్థాన్‌లోని ఫైసలాబాద్‌ నగరంలో ప్రాణాలు కోల్పోయినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. మల్కాన్‌వాలాలో అజామ్‌కు అంత్యక్రియలు నిర్వహించినట్లు సమాచారం.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని