CM Revanth: అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్‌: సీఎం రేవంత్‌

అంగన్వాడీల ద్వారా గర్భిణీలు, బాలింతలకు సరైన పౌష్టికాహారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు.

Published : 02 Mar 2024 16:20 IST

హైదరాబాద్‌: అంగన్వాడీల ద్వారా గర్భిణీలు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. పౌష్టికాహారం దుర్వినియోగం కాకుండా చూడాలని స్పష్టం చేశారు. మహిళా, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమశాఖపై అధికారులతో సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్‌ హాజరు ఉండేలా చూడాలని ఆదేశించారు. కేంద్రాలకు సొంత భవనాలపై దృష్టి సారించాలని సూచించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మొబైల్‌ అంగన్వాడీ కేంద్రాలపై అధ్యయనం చేయాలని చెప్పారు. మంత్రి సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సమీక్షకు హాజరయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని