Top 10 News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 23 Mar 2024 16:59 IST

1. కడప ఎంపీ సీటునూ మనమే గెలవబోతున్నాం: చంద్రబాబు

ఎన్డీయే కేంద్రంలో 400కుపైగా లోక్‌సభ స్థానాల్లో విజయం సాధిస్తుందని..రాష్ట్రంలో కూటమికి 160కిపైగా అసెంబ్లీ సీట్లు వస్తాయని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. తెదేపా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు విజయవాడలో ప్రత్యేక వర్క్‌షాప్‌ నిర్వహించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. సికింద్రాబాద్‌ భారాస ఎంపీ అభ్యర్థిగా పద్మారావుగౌడ్‌

సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి భారాస అభ్యర్థిని ఖరారు చేసింది. సిటింగ్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పద్మారావు గౌడ్‌ను అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ ప్రకటించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. తుక్కుగూడలో భారీ బహిరంగ సభ.. హాజరు కానున్న ఖర్గే, రాహుల్‌

తెలంగాణ కాంగ్రెస్‌ ఏప్రిల్‌ మొదటి వారంలో తుక్కుగూడలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌ గాంధీతోపాటు పలువురు ఏఐసీసీ ముఖ్యనాయకులు హాజరవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. దిల్లీ లిక్కర్‌ స్కామ్‌.. కేసీఆర్‌తో చర్చకు సిద్ధం: కిషన్‌రెడ్డి

తప్పు చేసిన వారిని అరెస్టు చేస్తే కక్ష సాధింపు ఎలా అవుతుందో కేసీఆర్‌ సమాధానం చెప్పాలని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. దిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థలు పలుమార్లు నోటీసులు ఇచ్చినా.. సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నారన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. కవిత ఈడీ కస్టడీ మూడు రోజుల పొడిగింపు..

వారం రోజుల కస్టడీ ముగియడంతో ఎమ్మెల్సీ కవితను రౌజ్‌ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో ఈడీ హాజరుపరిచింది. ఆమెను మరో 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని దర్యాప్తు అధికారులు కోర్టును కోరారు. కేసు దర్యాప్తు పురోగతిని ఈడీ న్యాయవాది కోర్టుకు వివరించారు. మరికొందరితో కలిపి ఆమెను ప్రశ్నించాల్సి ఉందని పేర్కొన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఏఐ టూల్స్‌తో శాంసంగ్‌ కొత్త లాప్‌ట్యాప్‌

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల తయారీ సంస్థ శాంసంగ్‌ (Samsung) కొత్త లాప్‌ట్యాప్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఇప్పటికే గెలాక్సీ బుక్‌4 సిరీస్‌లో బుక్‌4 ప్రో, బుక్‌4 ప్రో 360లను తీసుకొచ్చిన సంస్థ.. తాజాగా గెలాక్సీ బుక్‌ 4 (Samsung Galaxy Book 4) పేరుతో మరో కొత్త ల్యాపీని ఆవిష్కరించింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. లోక్‌సభ ఎన్నికల బరిలో ‘చిరుత’ నటి..?

సినీ రంగం నుంచి మరో నాయిక రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. ప్రముఖ బాలీవుడ్‌ నటి, మోడల్‌ నేహాశర్మ (Neha Sharma) వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో (Lok sabha Elections 2024) పోటీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. బిహార్‌ (Bihar) నుంచి ఆమెను బరిలోకి దింపాలని నేహా తండ్రి, కాంగ్రెస్‌ నేత అజిత్‌ శర్మ ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. కేజ్రీవాల్‌ అరెస్టుపై జర్మనీ ప్రకటన.. తీవ్రంగా మండిపడ్డ కేంద్రం

మద్యం విధానానికి (Delhi Excise Scam Case) సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)ను ఈడీ (ED) అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకుంది. దీనిపై జర్మనీ (Germany) విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన దుమారం రేపింది. కేజ్రీవాల్‌ విచారణ పారదర్శకంగా జరగాలంటూ అనవసర వ్యాఖ్యలు చేసింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. 110 దాటిన మృతుల సంఖ్య.. ఉక్రెయిన్‌ హస్తముందన్న రష్యా!

భీకర ఉగ్రదాడితో రష్యా (Russia) ఉలిక్కిపడింది. మాస్కోలోని క్రాకస్‌ సిటీ కాన్సర్ట్‌ హాల్‌లోకి చొరబడిన సాయుధ ముష్కరులు.. విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. ఈ ఘటన (Moscow Terror Attack)లో మృతుల సంఖ్య 115కు చేరుకుందని, అందులో ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. జైలు నుంచి ముఠాలను నడుపుతారు ప్రభుత్వాలను కాదు: భాజపా

దిల్లీ ప్రభుత్వాన్ని అరవింద్‌ కేజ్రీవాల్‌ జైలు నుంచే నడిపిస్తారంటూ మంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) నేత అతీషి(Atishi) చేసిన వ్యాఖ్యపై భారతీయ జనతా పార్టీ ఎంపీ మనోజ్‌ తివారీ(Manoj Tiwari) ఘాటుగా స్పందించారు. దిల్లీ ఈ దుస్థితికి రావడానికి కారణమే కేజ్రీవాల్. ప్రజలు అతనిపై కోపంగా ఉన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని