Top 10 News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 31 Mar 2024 16:59 IST

1. ఏపీలో పింఛన్ల పంపిణీపై క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ల పంపిణీపై కొనసాగుతోన్న సందిగ్ధతకు తెరపడింది. ఎన్నికల కోడ్‌ ముగిసే వరకు ఇంటింటికీ పింఛన్ల పంపిణీ ఉండదని గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్‌) ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో సచివాలయాల్లోనే పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. సకాలంలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయాలి: చంద్రబాబు

రాష్ట్రంలో పింఛన్ల పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఎన్నికల కోడ్‌ కారణంగా వాలంటీర్లతో పింఛన్ల పంపిణీని నిలిపివేస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేయడంతో ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలని విజ్ఞప్తి చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఈ ఎన్నికల్లో ఫ్యాన్‌ ముక్కలై చెత్తకుప్పలోకి పోవడం ఖాయం: చంద్రబాబు

ఈసారి ఎన్నికల్లో ఫ్యాన్‌ ముక్కలై చెత్తకుప్పలోకి పోవడం ఖాయమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఎమ్మిగనూరులో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన మాట్లాడారు. నమ్మినోళ్లను నట్టేట ముంచే వ్యక్తి జగన్‌ అని చంద్రబాబు ఆరోపించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. పిఠాపురంలో పవన్‌ పర్యటన.. ఆలయాల్లో ప్రత్యేక పూజలు

కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన (Janasena) అధినేత పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) పర్యటన కొనసాగుతోంది. రెండోరోజు పర్యటనలో భాగంగా పలు ఆలయాల్లో ఆయన ప్రత్యేకపూజలు నిర్వహించారు. పాదగయక్షేత్రంతో పాటు కుక్కుటేశ్వరస్వామి, రాజరాజేశ్వరీ దేవి, దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. మరో అభ్యర్థిని ప్రకటించిన జనసేన

జనసేన పార్టీ మరో అభ్యర్థిని ప్రకటించింది. విశాఖపట్నం దక్షిణ శాసనసభ స్థానం జనసేన అభ్యర్థిగా సీహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ పేరును పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఖరారు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆయన.. ఆదివారం ఉదయం పార్టీ ముఖ్యులతో వివిధ అంశాలపై చర్చించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిని విచారించిన దర్యాప్తు బృందం

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి సంధ్యా శ్రీధర్‌రావును అధికారులు విచారిస్తున్నారు. తన ఫోన్‌ సైతం ట్యాపింగ్‌ చేశారంటూ టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుపై పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఆయన ఫిర్యాదు చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. సన్‌రైజర్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌.. సిరీస్‌ మొత్తానికి స్టార్‌ స్పిన్నర్‌ దూరం

బ్యాటింగ్‌లో అదరగొడుతూ దూసుకుపోతున్న సన్‌రైజర్స్‌(SRH)కు మూడో మ్యాచ్‌కు ముందు బ్యాడ్‌ న్యూస్‌. తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన శ్రీలంక స్టార్‌ స్నిన్నర్‌ వానిందు హసరంగ.. ఇప్పుడు సిరీస్‌(IPL) నుంచే వైదొలిగాడు. దీర్ఘకాలంగా వేధిస్తున్న ఎడమ మడమ నొప్పి కారణంగా అతడు ఈ ఐపీఎల్‌ మొత్తానికి దూరమైనట్లు హైదరాబాద్‌ జట్టు ప్రకటించింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ప్రేమించా.. బ్రేకప్‌ అయ్యింది: విజయ్‌ దేవరకొండ

ఒకే సమయంలో ఇద్దరు వ్యక్తులతో రిలేషన్‌షిప్‌లో ఉండొచ్చా..? అనే విషయంపై ఓ ఇంటర్వ్యూలో విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వేర్వేరు వ్యక్తులతో ప్రేమలో పడటం సహజమేనని చెప్పిన ఆయన ఒకే సమయంలో ఇద్దరిని ప్రేమించడాన్ని అంగీకరించనని తెలిపారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి మాతృ వియోగం

తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడికి మాతృ వియోగం కలిగింది. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడలోని స్వగృహంలో కళావతమ్మ(90) ఆదివారం కన్నుమూశారు. కొంతకాలంగా వయోభారంతో అనారోగ్యం బారిన పడ్డారు. ఆమెకు నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. కాంగ్రెస్‌ నిర్లక్ష్యంతోనే కచ్చతీవు దీవిని వదిలేసింది: ప్రధాని మోదీ

కచ్చతీవు దీవి విషయంలో కాంగ్రెస్‌ వైఖరిని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) మరోసారి తప్పుపట్టారు. ఆ పార్టీ పూర్తి నిర్లక్ష్యంగా ఆ దీవిని శ్రీలంకకు ఇచ్చేసిందని ఆయన ఎక్స్‌వేదికగా ఆరోపించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని