Chandrababu: సకాలంలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయాలి: చంద్రబాబు

రాష్ట్రంలో పింఛన్ల పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు.

Published : 31 Mar 2024 16:05 IST

అమరావతి: రాష్ట్రంలో పింఛన్ల పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఎన్నికల కోడ్‌ కారణంగా వాలంటీర్లతో పింఛన్ల పంపిణీని నిలిపివేస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేయడంతో ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలని విజ్ఞప్తి చేశారు. వృద్ధులు, వితంతువులు, ఇతర లబ్ధిదారులకు నగదు రూపంలో పింఛను మొత్తం చెల్లించాలన్నారు.

గ్రామ సచివాలయ ఉద్యోగులు, ఇతర క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా సకాలంలో, ఎలాంటి జాప్యం లేకుండా పంపిణీ జరిపేలా చూడాలని డిమాండ్‌ చేశారు. పింఛన్ల పంపిణీకి అవసరమైన నిధులు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేయలేదనే వార్తలు వస్తున్నాయని, నిధులు వెంటనే అందుబాటులో ఉంచాలని కోరారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి కూడా చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్రంలో పింఛన్ల పంపిణీకి తగు చర్యలు చేపట్టేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని సీఈవోను కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని