Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 15 Apr 2024 16:59 IST

1. గులకరాయి డ్రామా ఫెయిల్‌.. జగన్‌ ఫ్యామిలీ జాగ్రత్తగా ఉండాలి: చింతమనేని

సీఎం జగన్‌పై రాయి దాడి నేపథ్యంలో ఆయన కుటుంబసభ్యులు జాగ్రత్తగా ఉండాలని తెదేపా మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అన్నారు. అమరావతిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గులకరాయి డ్రామా విఫలమవడంతో ఎవరైనా బలికావొచ్చు. విజయమ్మ ముందు జాగ్రత్తగా అమెరికా వెళ్లారని ప్రజలు అనుకుంటున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఎన్నికల్లో ధన వర్షం.. రోజుకు రూ.100కోట్లు సీజ్‌!

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభాలకు గురికాకుండా చూసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేపట్టింది. ఇందులో భాగంగా మార్చి 1 నుంచి నిత్యం సగటున రూ.100 కోట్ల విలువైన నగదు ఇతర తాయిలాలను అధికారులు సీజ్‌ చేస్తున్నట్లు ఈసీ వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. తన కంచుకోటనే కాపాడుకోలేకపోయారు: రాహుల్‌పై మోదీ ఎద్దేవా

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ సోమవారం కేరళలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీపై విమర్శలు చేశారు. ఆయన తన కుటుంబానికి కంచుకోటను రక్షించుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. యూపీలోని అమేఠీ లోక్‌సభ స్థానం నుంచి రాహుల్‌ వరుసగా 15 ఏళ్లపాటు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. డ్రై ప్రమోషన్‌.. జాబ్‌ మార్కెట్‌లో ఇదో కొత్త ట్రెండ్‌

ప్రపంచ జాబ్ మార్కెట్ ఎప్పటికప్పుడు కొత్త రూపును సంతరించుకుంటోంది. మారుతున్న టెక్నాలజీ, ఉద్యోగుల అవసరాలకు అనుగుణంగా కొత్త ధోరణులు పుట్టుకొస్తున్నాయి. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌, మూన్‌లైటింగ్‌, కాఫీ బ్యాడ్జింగ్‌, క్వైట్‌ క్విటింగ్‌ .. వంటివన్నీ అందులో భాగమే. తాజాగా ‘డ్రై ప్రమోషన్‌’ అనే కొత్త పదం ట్రెండింగ్‌లోకి వస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5.ఉగ్ర ‘కర్నల్‌’కు టచ్‌లో రామేశ్వరం కెఫే మాస్టర్‌మైండ్‌..!

రామేశ్వరం కెఫే దాడికి మాస్టర్‌ మైండ్‌గా భావిస్తున్న అబ్దుల్‌ మథీన్‌ అహ్మద్‌ తాహా భారత్‌లో ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రసంస్థకు చెందిన కీలకమైన వ్యక్తి (హైవేల్యూ అసెట్‌)గా ఎన్‌ఐఏ అధికారులు అనుమానిస్తున్నారు. దక్షిణ, మధ్య భారత్‌లో జరిగిన అనేక ఉగ్రవాద కేసులతో సంబంధం ఉన్న ‘కర్నల్‌’ అనే వ్యక్తితో తాహా టచ్‌లో ఉన్నట్లు తేలింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. భారీ నష్టాల్లో సూచీలు.. రూ.5 లక్షల కోట్లు ఆవిరి!

దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణ పరిస్థితులు సూచీలను పడేశాయి. సెన్సెక్స్‌ 800కు పైగా పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 22,300 దిగువకు చేరింది. మదుపరుల సంపదగా భావించే బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.5 లక్షల కోట్లు క్షీణించి రూ.394 లక్షల కోట్లకు చేరింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ‘కేజ్రీవాల్‌ను కరడుగట్టిన నేరస్థుడిలా చూస్తున్నారు’ - పంజాబ్‌ సీఎం ఆరోపణ

తిహాడ్‌ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను కరడుగట్టిన నేరస్థుల కంటే దారుణంగా చూస్తున్నారని పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ ఆరోపించారు. నేరస్థులకు ఇచ్చే కనీస సదుపాయాలు కూడా కేజ్రీవాల్‌కు కల్పించడం లేదన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. న్యాయ వ్యవస్థను కాపాడుకోవాలి.. భారత ప్రధాన న్యాయమూర్తికి రిటైర్డ్‌ న్యాయమూర్తుల లేఖ

సుప్రీంకోర్టు, వివిధ హైకోర్టులకు చెందిన 21 మంది రిటైర్డ్‌ న్యాయమూర్తులు సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి ఓ లేఖ రాశారు. న్యాయవ్యవస్థను కాపాడుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయని అభిప్రాయపడ్డారు.  కొన్ని వర్గాలు తప్పుడు సమాచారం అందిస్తూ న్యాయ వ్యవస్థను బహిరంగంగా అవమానిస్తున్నారని, అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. గాయం బాధతోనే ధోనీ సిక్సర్ల బాదుడు.. చెన్నై కోచ్‌ ఏమన్నాడంటే?

ఓ వైపు గాయం నొప్పి బాధిస్తున్నా.. ఫ్యాన్స్‌ కోసం మైదానంలోకి అడుగు పెడుతున్నాడు ఎం.ఎస్‌.ధోనీ. నొప్పిని భరిస్తూనే ముంబయిపైనా హిట్టింగ్‌ చేశాడని చెన్నై బౌలింగ్‌ కోచ్‌ ఎరిక్ సిమన్స్‌ తెలిపాడు. ‘‘ప్రతి సారి ధోనీ మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉన్నాడు. అతడితో దగ్గరగా ఉండి పనిచేయడం అద్భుతం’’అని అన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. రెండు దశాబ్దాల పాలనకు తెర..! పదవి వీడనున్న సింగపుర్‌ ప్రధాని

ఆర్థిక సుసంపన్న దేశమైన సింగపుర్ ప్రధానమంత్రి లీ సీన్‌ లూంగ్‌ ఆ బాధ్యతల నుంచి వైదొలగనున్నారు. దాదాపు రెండు దశాబ్దాలుగా అధికారంలో ఉన్న ఆయన.. మే 15న పదవి నుంచి దిగిపోనున్నట్లు ప్రకటించారు. నాయకత్వ మార్పు అనేది ఏ దేశానికైనా అత్యంత ముఖ్యమైన క్షణమని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని