Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 19 May 2024 17:07 IST

1. తెలంగాణ కేబినెట్‌ భేటీ.. షరతులతో కూడిన అనుమతిచ్చిన ఈసీ

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహణకు ఎన్నికల సంఘం(ఈసీ) షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. జూన్‌ 4లోపు చేయాల్సిన అత్యవసర విషయాలపై మాత్రమే చర్చించాలని.. రైతు రుణమాఫీ, ఉమ్మడి రాజధాని అంశాలపై చర్చించవద్దని పేర్కొంది. రాష్ట్ర సచివాలయంలో శనివారం జరగాల్సిన మంత్రిమండలి సమావేశం వాయిదా పడిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. తిరుపతి జిల్లాలో పలుచోట్ల ‘సిట్‌’ విచారణ.. పలు విషయాలపై ఆరా!

ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో తిరుపతి జిల్లాలో పలుచోట్ల సిట్‌ బృందం విచారణ చేపట్టింది. జిల్లా కేంద్రంలోని ఎస్వీయూ, పద్మావతి మహిళా యూనివర్సిటీతో పాటు చంద్రగిరి మండలం కూచువారిపల్లె, రామిరెడ్డిపల్లెలో సిట్‌ అధికారులు పలువురిని విచారించారు. కూచువారిపల్లెలో వైకాపా అభ్యర్థి మోహిత్‌రెడ్డి గన్‌మెన్‌ ఈశ్వర్‌, గ్రామస్థులను అధికారులు విచారించి పలు విషయాలపై ఆరా తీశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. బలహీనపడిన ఆవర్తనం.. తెలంగాణలో మరో 3 రోజుల పాటు వర్షాలు

తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. కర్నూలులో చెరువు వద్ద ముగ్గురు ట్రాన్స్‌జెండర్ల అనుమానాస్పద మృతి

ముగ్గురు ట్రాన్స్‌జెండర్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కర్నూలు సమీపంలోని గార్గేయపురం చెరువు వద్ద చోటుచేసుకుంది. తొలుత చెరువులో ఇద్దరి మృతదేహాలను స్థానికులు గుర్తించి కర్నూలు తాలూకా పోలీసు స్టేషన్‌కు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటనాస్థలానికి వచ్చి పరిశీలించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. అప్పుడు.. ఒక్కసారి కూడా స్కోరు బోర్డు చూడలేదు: యశ్‌ దయాళ్‌

ఆర్సీబీ తరఫున 13 మ్యాచుల్లో 15 వికెట్లు తీశాడు యశ్‌ దయాళ్. మరీ ముఖ్యంగా ప్లేఆఫ్స్‌కు కీలకమైన చెన్నైతో మ్యాచ్‌లో రెండు వికెట్లు పడగొట్టాడు. చివరి ఓవర్‌ను కట్టుదిట్టంగా వేసి డేంజరస్ బ్యాటర్ ధోనీని ఔట్ చేసి హీరోగా మారిపోయాడు. ఈ మ్యాచ్‌ అనంతరం సిరాజ్‌తో యశ్‌ మాట్లాడుతూ.. చివరి ఓవర్ వేస్తున్నప్పుడు ఒక్కసారి కూడా స్కోరు బోర్డు వైపు చూడలేదని తెలిపాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఎంపీగా గెలిస్తే.. బాలీవుడ్‌ను వీడుతారా? కంగనా ఏం చెప్పారంటే..

ప్రముఖ బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌.. ఈ సార్వత్రిక ఎన్నికల్లో హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానం నుంచి భాజపా అభ్యర్థిగా పోటీలో ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నికల్లో విజయం సాధిస్తే సినిమాలకు దూరంగా ఉంటారా? అనే ప్రశ్నకు ఆమె అవుననే సమాధానమిచ్చారు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఎయిర్‌లైన్స్‌ లాభాల్లో బిగ్‌ జంప్‌.. ఉద్యోగులకు 8 నెలల జీతం బోనస్‌..

ప్రముఖ విమానయాన సంస్థ సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ రికార్డు స్థాయిలో లాభాలు నమోదు చేసింది. అంచనాలకు మించి లాభాలు నమోదు చేయడంతో తన సిబ్బందికి బంపర్‌ ఆఫర్‌ అందించాలని నిర్ణయించింది. ఎనిమిది నెలల జీతాన్ని బోనస్‌గా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఆప్‌ అంతానికి భాజపా ‘ఆపరేషన్‌ ఝాడు’: కేజ్రీవాల్‌

భాజపా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలపై ఆమ్‌ఆద్మీపార్టీ కన్వీనర్‌, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆప్‌ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు ‘ఆపరేషన్‌ ఝాడు’ కార్యక్రమాన్ని మొదలుపెట్టారని ఆరోపించారు. బిభవ్‌ కుమార్‌ అరెస్టుకు నిరసనగా భాజపా ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించేందుకు పార్టీ కార్యకర్తలతో బయలుదేరిన వేళ కేజ్రీవాల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. రిషి సునాక్‌ దంపతుల సంపద.. రాజు ఆస్తుల కంటే ఎక్కువ!

బ్రిటన్‌ ప్రధానమంత్రి రిషి సునాక్, ఆయన సతీమణి అక్షతామూర్తిల ఆస్తులు బ్రిటన్ రాజు చార్లెస్‌ III కంటే ఎక్కువని తేలింది. కింగ్‌ చార్లెస్‌ సంపద గత ఏడాది కాలంలో 600 మిలియన్‌ పౌండ్ల నుంచి 610 మిలియన్‌ పౌండ్లకు చేరుకుంది. సునాక్‌ దంపతుల సంపద మాత్రం 529 మిలియన్‌ పౌండ్ల నుంచి 651 మిలియన్‌ పౌండ్లకు పెరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. పంచన్‌ లామా ఎక్కడ: చైనాను మరోసారి అడిగిన అమెరికా

అమెరికా-చైనా మధ్య మరోసారి ఉద్రిక్తతలు తలెత్తాయి. టిబెట్‌ ఆధ్యాత్మిక గురువు కావాల్సిన పంచన్‌ లామా ఆచూకీని బీజింగ్‌ ప్రకటించాలని వాషింగ్టన్‌ డిమాండ్‌ చేసింది. సురక్షితంగా ఉన్నాడా?లేడా? అన్న విషయాన్ని వెల్లడించాలని కోరింది. హిమాలయాల్లో పంచన్‌ లామా అదృశ్యమై 29 ఏళ్లు పూర్తైన సందర్భంగా అమెరికా ఈ వ్యాఖ్యలు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని