Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 20 Mar 2024 09:07 IST

1. దందాలు చేసేవారే పార్టీని వీడుతున్నారు

వ్యాపారాలు, భూకబ్జాలు, దందాలు చేసే నాయకులే భారాస పార్టీని వీడుతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మంగళవారం హనుమకొండ బాలసముద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో వర్ధన్నపేట నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాకు వివరాలు వెల్లడించారు. పూర్తి కథనం

2. ప్రభుత్వోద్యోగులు.. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే కఠిన చర్యలు

ప్రభుత్వోద్యోగులు ఏదైనా రాజకీయ పార్టీకి లేదా అభ్యర్థికి అనుకూలంగా ఎన్నికల ప్రచారం చేసినా, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన్నా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనా హెచ్చరించారు. రాజకీయ పార్టీల నుంచి ప్రయోజనం, బహుమతి పొందటం ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించటమేనని స్పష్టం చేశారు.పూర్తి కథనం

3. ఇక్కడ హిమాలయాలే చిన్నబోతాయి..

అవి సహజ సిద్ధంగా ఏర్పడిన గుట్టలు, అబ్బురపరిచే గుహలు, ప్రాచీనమైన వర్ణ చిత్రాలు, నీటి చెలిమెలు ఇలా ఎన్నో విశేషాలు అక్కడ కనిపిస్తాయి. చుట్టూ పచ్చని పంట చేలు.. ఆ మధ్యలో రమణీమైన ప్రకృతి అందాలు.. ఇవన్నీ జయశంకర్‌ జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి శివారు రావులపల్లి సమీపంలో ఉన్న పాండవుల గుట్టల్లో దాగివున్నాయి.పూర్తి కథనం

4. ప్రజాగళానికి వచ్చారని చంపేశారు

చిలకలూరిపేట ప్రజాగళం సభకు వచ్చారన్న కారణంగా గిద్దలూరు నియోజకవర్గం, గడికోటకు చెందిన మూలయ్యను వైకాపా రౌడీ మూకలు గొడ్డలితో నరికి చంపాయని, ఆళ్లగడ్డలోని చాగలమర్రిలో ఇమామ్‌హుస్సేన్‌ అనే 21 ఏళ్ల యువకుడిని కత్తులతో పొడిచి హత్య చేశారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. మాచర్లలో తెదేపా కార్యకర్త సురేశ్‌ కారును తగలబెట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు.పూర్తి కథనం

5. అసెంబ్లీ బలాలు అక్కరకొచ్చేనా?

హైదరాబాద్‌ నగరంలో సార్వత్రిక ఎన్నికల సందడి మొదలైంది. అత్యధిక స్థానాలను కైవసం చేసుకునేందుకు పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలవడంతో నేతలు పార్టీలు మారడం జోరందుకుంది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే రానున్న సార్వత్రిక పోరుకు పార్టీల బలాబలాలు మారిపోతున్నాయి.పూర్తి కథనం

6. రాజకీయ ప్రయోజనాలు ఆశించి పిల్‌ వేయలేదు

వైకాపా ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా సీఎం జగన్‌, ఆయన బంధుగణం పొందిన అనుచిత లబ్ధిపై సీబీఐ విచారణ కోసం ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో వేసిన పిల్‌పై విచారణ జూన్‌ చివరి వారానికి వాయిదా పడింది. రాజకీయ ప్రయోజనాలను ఆశించి పిల్‌ వేయలేదని, ఈ నేపథ్యంలో ఎన్నికల తర్వాత విచారణ చేపట్టినా తనకు అభ్యంతరం లేదని ఎంపీ రఘురామ హైకోర్టులో తాజాగా అఫిడవిట్‌ దాఖలు చేశారు.పూర్తి కథనం

7. జగన్‌ భద్రతకు ముప్పుంటే.. బస్సుయాత్ర ఎలా చేస్తారు?: ఆనం

సీఎం జగన్‌కు, ఆయన కుటుంబానికి భద్రత పెంచుతున్నట్లు డీజీపీ మూడు నెలల క్రితం ప్రకటించారు. అయిదేళ్లుగా ప్రజల కష్టాలను పట్టించుకోని జగన్‌.. ఎన్నికలు సమీపిస్తుండటంతో బస్సుయాత్ర పేరుతో బయటకు వస్తున్నారు. డీజీపీ చెప్పినట్లు భద్రతాపరమైన ముప్పు ఉంటే.. బస్సుయాత్రకు ఎలా అనుమతిస్తారు?పూర్తి కథనం

8. వైకాపా ప్రచార యావ.. ప్రజాధనం వృథా

వైకాపా నాయకుల ప్రచార యావ వల్ల ఇప్పటికే రూ.కోట్లలో ప్రజాధనం వృథా అయింది. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో వాటన్నింటినీ తీసేయటానికి, రంగులు చెరపడానికి మళ్లీ భారీగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.పూర్తి కథనం

9. టిడ్కో ఇళ్లు.. కదిపితే కన్నీళ్లు!

పేదల సంక్షేమం కోసం అయిదేళ్లలో రూ. కోట్లు ఖర్చు చేశామని పదేపదే చెబుతున్న వైకాపా పెద్దలకు.. టిడ్కో ఇళ్లు కనిపించడం లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత మూడేళ్లు అసలు పట్టించుకోనే లేదు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఇళ్లు పూర్తికాకుండానే గృహ ప్ర‘వేషాల’ పేరుతో హడావుడి చేశారు. వేలాది మందికి గృహయోగం కల్పించామని ప్రగల్భాలు పలికారు. ఒకరిద్దరికే తాళాలు అప్పగించడంతో లబ్ధిదారులు ఆందోళన చేశారు.పూర్తి కథనం

10. సంతాన సాఫల్య కేంద్రాల్లో ఇష్టారాజ్యం!

మాతృత్వపు మధురిమల కోసం పరితపించేవారి బలహీనతలను ఆసరాగా చేసుకుని కొన్ని సంతాన సాఫల్య కేంద్రాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. రాష్ట్రంలో ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్వహిస్తున్నవి కొన్నయితే.. అనుమతులను పునరుద్ధరించుకోకుండానే కొనసాగుతున్నవి మరికొన్ని ఉన్నట్లు అధికారులు గుర్తించారు.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని