జగన్‌ భద్రతకు ముప్పుంటే.. బస్సుయాత్ర ఎలా చేస్తారు?: ఆనం

‘సీఎం జగన్‌కు, ఆయన కుటుంబానికి భద్రత పెంచుతున్నట్లు డీజీపీ మూడు నెలల క్రితం ప్రకటించారు. అయిదేళ్లుగా ప్రజల కష్టాలను పట్టించుకోని జగన్‌.. ఎన్నికలు సమీపిస్తుండటంతో బస్సుయాత్ర పేరుతో బయటకు వస్తున్నారు.

Published : 20 Mar 2024 04:24 IST

అయిదేళ్లుగా ఇదే చెప్పి.. ప్రజలను మోసం చేసినట్టేనా

ఈనాడు, నెల్లూరు: ‘సీఎం జగన్‌కు, ఆయన కుటుంబానికి భద్రత పెంచుతున్నట్లు డీజీపీ మూడు నెలల క్రితం ప్రకటించారు. అయిదేళ్లుగా ప్రజల కష్టాలను పట్టించుకోని జగన్‌.. ఎన్నికలు సమీపిస్తుండటంతో బస్సుయాత్ర పేరుతో బయటకు వస్తున్నారు. డీజీపీ చెప్పినట్లు భద్రతాపరమైన ముప్పు ఉంటే.. బస్సుయాత్రకు ఎలా అనుమతిస్తారు? ఒకవేళ ముప్పు లేకుంటే ఇప్పటివరకు అబద్ధాలు చెప్పినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పి.. బస్సు ఎక్కాలి’ అని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి పేర్కొన్నారు. నెల్లూరులోని తెదేపా కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడారు. ‘బస్సుయాత్ర పేరుతో అయిదేళ్లలో మొదటిసారి ప్రజల్లోకి వస్తున్న జగన్‌ను స్వాగతిస్తున్నాం. ప్రధానమంత్రి మూడు హెలికాప్టర్లలో వస్తారు కాబట్టి.. తానేమీ తక్కువ కాదన్నట్లు రెండు హెలికాప్టర్లు పెట్టుకుని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. మొన్నటివరకు బారికేడ్లు, పరదాలమాటున ప్రయాణం చేసిన జగన్‌.. అదే బస్సుయాత్ర అలాగే చేస్తారా? అవి కట్టకుండా బస్సుయాత్ర చేస్తే.. ఈ అయిదేళ్లలో ప్రజల మధ్యకు రాలేకపోయినందుకు క్షమాపణలు చెప్పాలి’ అని డిమాండు చేశారు. ఇప్పటికైనా రోడ్లపైకి వస్తున్న జగన్‌కు.. తన విధ్వంసపాలన చూసే అవకాశం ఏర్పడిందని రమణారెడ్డి అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని