Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 05 Jul 2023 10:36 IST

1. కార్లకు మన దగ్గరా స్టార్‌ రేటింగ్‌

కార్ల భద్రతా ప్రమాణాలకు సూచికగా నిలిచే గ్లోబల్‌ఎన్‌క్యాప్‌ రేటింగ్స్‌ తరహాలో దేశీయంగా స్టార్‌ రేటింగ్‌లు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. అందులో భాగంగా భారత్‌ న్యూ కార్‌ అసెస్‌మెంట్‌ ప్రోగామ్‌(బీఎన్‌క్యాప్‌)పై ముసాయిదా నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ ఏడాది అక్టోబరు 1 నుంచి దీనిని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సాధారణంగా క్రాష్‌ పరీక్షల్లో, వాహనాలు ఎలా తట్టుకున్నాయి అనేదానిని బట్టి ‘స్టార్‌’ రేటింగ్‌లు ఇస్తుంటారు. అత్యంత సురక్షితమైనదైతే 5 స్టార్‌ రేటింగ్‌, మరీ అధ్వానమైతే 0 రేటింగ్‌ ఇస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. టీ దుకాణం నడుపుతున్న యూపీ సీఎం యోగి సోదరి!

ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సోదరి శశి పాయల్‌ ఓ చిన్న గ్రామంలో టీ దుకాణాన్ని నడుపుతూ నిరాడంబర జీవితాన్ని గడుపుతున్నారు. ఉత్తరాఖండ్‌లోని పౌఢీలో మాతా భువనేశ్వరి ఆలయ సమీపంలో శశి పాయల్‌ టీ దుకాణం ఉంది. వర్షం పడిందంటే ఆ మార్గంలో వెళ్లడం కూడా  కష్టమే. ఈ వీడియోను మాజీ ఎమ్మెల్యే దినేశ్‌ చౌదరి తన ట్విటర్‌ హ్యాండిల్‌లో పోస్ట్‌ చేయగా.. అది వైరల్‌గా మారింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. యూసీసీపై ఆగని రగడ

ఉమ్మడి పౌరస్మృతిపై (యూసీసీ) వివాదం కొనసాగుతూనే ఉంది. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో భాజపా ప్రభుత్వం యూసీసీ బిల్లు పెట్టనున్న నేపథ్యంలో పలువురు స్పందిస్తున్నారు. కొందరు వ్యతిరేకిస్తుండగా మరి కొందరు సమర్థిస్తున్నారు. యూసీసీని అమలు చేస్తామని భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక్కొక్కరుగా ప్రకటిస్తున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. కళ్లకు గంతలతో అద్భుతాలు చేస్తున్న బాలిక

పద్నాలుగేళ్ల బాలిక కళ్లకు గంతలు కట్టుకొని సైకిలు నడుపుతోంది. కరెన్సీ నోట్లు, దుస్తుల రంగులు సులభంగా గుర్తుపడుతోంది. దీంతో ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి జిల్లాకు చెందిన రియా తివారీని అందరూ ‘మిరాకిల్‌ కిడ్‌’ అంటున్నారు. లోహతా హర్‌పాల్‌పుర్‌ గ్రామానికి చెందిన రియా పదో తరగతి చదువుతోంది. మెడిటేషన్‌, యోగా లాంటి వాటిపై ఆసక్తి ఉన్న రియా.. తండ్రి ప్రోత్సాహంతో మిడ్‌ బ్రెయిన్‌ యాక్టివేషన్‌ కోర్సు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. 19 ఏళ్ల తర్వాత ఇంటికొచ్చి.. భర్తను మళ్లీ పెళ్లాడిన ఊర్మిళ

పందొమ్మిదేళ్ల కిందట.. మతి తప్పి ఎటో వెళ్లిపోయిన ఓ మహిళ ఇటీవల తిరిగి తన ఇంటికి చేరుకొంది. ఈ ఆనందంలో ఆమె పిల్లలు అమ్మానాన్నలకు మళ్లీ పెళ్లి చేశారు. ఒడిశాలోని కటక్‌ జిల్లాలో ఈ ఘటన జరిగింది. భబ్‌చంద్‌పుర్‌ గ్రామానికి చెందిన బసంత్‌ పరిదా, ఊర్మిళ పరిదా భార్యాభర్తలు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. 2004లో తన మేనల్లుడి ఇంటికి వెళ్తానని బయలుదేరిన ఊర్మిళ.. మతిస్థిమితం కోల్పోయి మళ్లీ ఇంటికి వెళ్లే మార్గం మరిచిపోయింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఈ బాదుడుకు.. పేదలు బతికేదెలా?

నాలుగేళ్లలో పెరిగిన నిత్యావసరాల ధరల వల్ల ఒక్కో కుటుంబంపై నెలకు రూ.3,400 వరకు భారం పడింది. అంటే వంటింటి బడ్జెట్‌ ఏడాదికి రూ.40,800 పెరిగింది. పెరిగిన వంటగ్యాస్‌ సిలిండర్ల ధరలను పరిశీలిస్తే.. నాలుగేళ్లకు రూ. 12,800 బాదేశారు. ‘మీ బిడ్డ పాలనలో..’ అంటూ కుడిచేత్తో వడ్డిస్తూ, ఎడమచేత్తో విదిలిస్తూ పేదల నడ్డి విరగ్గొట్టడంలో జగన్‌ను మించిన నాయకుడు ఎవరుంటారు?పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. బడి బస్సులకు ఏంటీ బెడద?

రాష్ట్రంలో ఎక్కడ సీఎం జగన్‌ సభ జరిగినా.. వందల కొద్దీ విద్యా సంస్థల బస్సులను ప్రజలను తరలించేందుకు మళ్లిస్తున్నారు. బడి బస్సులను కేవలం విద్యార్థులను ఇళ్ల నుంచి బడికి తీసుకెళ్లి, తిరిగి తీసుకొచ్చేందుకు మాత్రమే ఉపయోగించాలి. అందుకే వీటికి స్టేజ్‌ క్యారియర్‌, కాంట్రాక్ట్‌ క్యారియర్‌ బస్సులతో పోలిస్తే.. పన్నులో దాదాపు 98 శాతం రాయితీతో ప్రత్యేకంగా పర్మిట్‌ ఇస్తారు. కానీ సీఎం సభలు విజయవంతమయ్యేలా చేయడానికి విద్యాసంస్థలపై ఒత్తిడి తెచ్చి బస్సులను బలవంతంగా లాక్కుంటున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. పక్క వీధిలో ఉన్నా.. పట్టుకోలేక!

 ‘ఒంగోలు బిలాల్‌నగర్‌కు చెందిన బాలిక అదృశ్యం ఉదంతంలో వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. ఆమెకు తండ్రి లేరు. తల్లి జీవనోపాధి కోసం ఇతర ప్రాంతానికి వలస వెళ్లారు. సోదరుడితో కలిసి ఇంట్లో ఉంటోంది. సమీపంలో నివసించే ఖలీల్‌ అనే యువకుడు ఆమెపై కన్నేశాడు. మాయమాటలు చెప్పి జూన్‌ 15న ఆమెను ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లాడు. బాలిక సోదరుడు జూన్‌ 16న అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తితో కలిసి వాహనంపై వెళ్లినట్లు అందులో పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. విమానం.. మోదీ ఇవ్వాలి బహుమానం!

రాష్ట్రంలో హైదరాబాద్‌ తర్వాత అతిపెద్ద నగరం ఓరుగల్లు. పర్యాటక, సాంస్కృతిక నిలయంగా, విద్యాకేంద్రంగా పేరు పొందింది. అలాంటిది వరంగల్‌లో విమానాశ్రయం లేదు. రాకపోకలు సాగించేవారు బస్సులు, రైళ్లు, కార్లపైనే ఆధారపడాల్సి వస్తోంది. ప్రధాని నరేంద్రమోదీ ఈనెల 8న వరంగల్‌ పర్యటనకు రానున్న నేపథ్యంలో మామునూరు విమానాశ్రయం పునరుద్ధరణపై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. కొంచెం మోదం.. కొంచెం ఖేదం..

భారతీయ జనతా పార్టీలో మార్పులు, చేర్పులు ఉమ్మడి జిల్లా పార్టీ శ్రేణుల్లో ఒకింత ఆనందాన్ని.. కొంత ఆవేదనను నింపాయి. కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ను కీలకమైన రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించడం కమలనాథులను కలవరానికి గురి చేయగా.. హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను రాష్ట్ర పార్టీలో కీలకమైన ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగించడం కొంత జోష్‌ నింపింది.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలకమైన మార్పులు, చేర్పులు చేపట్టడం అందులో కరీంనగర్‌ జిల్లానే కేంద్ర బిందువు కావడంపై విస్తృతమైన చర్చ జరుగుతోంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని