Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 24 Jul 2023 09:14 IST

1. నన్నే తప్పిస్తారా.. తేల్చుకుంటా!

పోలీసు శాఖలో అత్యంత కీలకం స్పెషల్‌ బ్రాంచ్‌(ఎస్‌బీ). జిల్లాలో చోటుచేసుకుంటున్న ఘటనలు.. పోలీస్‌ స్టేషన్లలో ఏం జరుగుతోందనే సమాచారం ఎప్పటికప్పుడు ఈ విభాగం ద్వారానే జిల్లా పోలీస్‌ బాస్‌కు చేరుతాయి. క్షేత్రస్థాయిలో ప్రతి నియోజకవర్గానికి ఒక ఏఎస్సై లేదంటే హెడ్‌ కానిస్టేబుల్‌ పనిచేస్తుంటారు. అయినప్పటికీ క్షేత్రస్థాయి పోలీసింగ్‌లోని లోపాలు, వాస్తవ పరిస్థితులు ఉన్నతస్థాయికి చేరటం లేదు. అవి రాష్ట్ర వ్యాప్త సంచలనాలుగా మారుతున్నాయి పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. వారం పాటు నాలుగు రైళ్ల రద్దు

సికింద్రాబాద్‌ డివిజన్‌ పరిధిలో నిర్వహణ పనుల కారణంగా నాలుగు రైళ్లను ఈనెల 24 నుంచి 30 వరకు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఇందులో కాచిగూడ-నిజామాబాద్‌ (07596), నిజామాబాద్‌-కాచిగూడ (07593), హెచ్‌.ఎస్‌.నాందేడ్‌-నిజామాబాద్‌ (07854), నిజామాబాద్‌-హెచ్‌.ఎస్‌.నాందేడ్‌ (07853) రైళ్లున్నాయి. మరో రెండు రైళ్లను 24-30 తేదీల మధ్య పాక్షికంగా రద్దు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. పైలెట్‌ లేకున్నా.. పట్టాలపై పరుగులు

డ్రైవర్‌ రహిత మెట్రో రైలు సంచారం ఏడాది లోగా ప్రారంభించనున్నారు. అందుకు తగ్గిన ఏర్పాట్లలో బీఎంఆర్‌సీఎల్‌ అధికారులు నిమగ్నమయ్యారు. అలాంటి రైళ్లు దిల్లీ, ముంబయిలో సంచరిస్తున్నాయి. డ్రైవర్‌ రహిత రైళ్లను బీఈఎంఎల్‌ సిద్ధం చేసి అందించింది. నగరంలో అలాంటి రైళ్ల సంచారానికి ఆరుబోగీలతో కూడిన మెట్రో రైలును సిద్ధం చేయాలని బీఎంఆర్‌సీఎల్‌, బెమల్‌కు సూచించడంతో పాటు ఒప్పందం చేసుకున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. వరదలను మింగే ‘స్పాంజ్‌’

తీవ్ర వరదముప్పు ఉన్న నగరాల్లో చెన్నై ఒకటి. ఈ ముప్పు నుంచి బయటపడేందుకు వినూత్న ఆలోచనతో గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ (జీసీసీ) ముందుకొచ్చింది. వరద నీటిని పీల్చి భూమిలోకి పంపే స్పాంజ్‌పార్కుల నిర్మాణానికి ముందుకొచ్చింది. నగరంలోని చాలా ప్రాంతాలు ఏటా ముంపుబారిన పడుతూనే ఉంటాయి. 2015లో వచ్చిన వరద చెన్నైలో వందల ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ముప్పుల నుంచి ఉపశమనం పొందేందుకు నగరవ్యాప్తంగా రూ.7.67 కోట్లతో 57 స్పాంజ్‌ పార్కులను నిర్మించాలని అధికారులు ప్రతిపాదించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. వదంతులు.. అసత్యవార్తల ఆజ్యం

మణిపుర్‌లో అల్లర్లు జరిగి 160 మంది చనిపోవడానికి అధిక శాతం వదంతులు, అసత్య వార్తలే (ఫేక్‌ న్యూసే)కారణమని అధికారులు అంటున్నారు. వివిధ భద్రతా బలగాల అంచనాల ఆధారంగా ఈ విషయం వెల్లడైందని చెబుతున్నారు. ‘చురాచాంద్‌పుర్‌లో గిరిజనులు ఒకరిని చంపి పాలిథీన్‌ కవరులో చుట్టి పడేశారంటూ ఓ చిత్రాన్ని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఫేస్‌బుక్‌లో ప్రేమ.. ప్రియుడి కోసం పాక్‌కు వెళ్లిన భారత మహిళ

పబ్‌జీ ఆన్‌లైన్‌ గేమ్‌లో పరిచయమైన యువకుడి కోసం తన నలుగురు పిల్లలతో కలసి భారత్‌లోకి ప్రవేశించిన పాకిస్థాన్‌ మహిళ సీమా హైదర్‌ ఉదంతం ఇంకా వార్తల్లో ఉండగానే.. ఆ తరహా ఘటన మరొకటి చోటుచేసుకోవడం గమనార్హం. ఈసారి ఓ భారతీయ మహిళ ఫేస్‌బుక్‌ స్నేహితుణ్ని కలుసుకునేందుకు పాక్‌లో అడుగుపెట్టింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. బిహార్‌లో అద్భుతం.. బోరుబావిలో పడిన బాలుడు సురక్షితం

బిహార్‌లోని నలంద జిల్లాలో ఆదివారం బోరుబావిలో పడిన అయిదేళ్ల బాలుడు మృత్యువును జయించాడు. శిలాయో బ్లాక్‌లోని కుల్‌ గ్రామంలో స్నేహితులతో ఆడుకుంటూ శివమ్‌ కుమార్‌ ప్రమాదవశాత్తు 50 అడుగుల బోరుబావిలో పడిపోయాడు. దీంతో రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్‌ సహాయక బృందాలు బాలుడిని రక్షించేందుకు జేసీబీ యంత్రాలతో బోరుబావికి సమాంతరంగా తవ్వకాలు చేపట్టాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. బ్యూటీషియన్లకు అండాశయ క్యాన్సర్‌ ముప్పు

 దీర్ఘకాలంగా హెయిర్‌ డ్రెస్సర్లు, బ్యూటీషియన్లుగా పనిచేసే మహిళలకు అండాశయ క్యాన్సర్‌ ముప్పు ఎక్కువని తాజా అధ్యయనం పేర్కొంది. సేల్స్‌, రిటైల్‌, వస్త్ర తయారీ, నిర్మాణ రంగ పరిశ్రమల్లో పనిచేసేవారికి కూడా ఎంతోకొంత ముప్పు ఉందని తెలిపింది. సౌందర్యాన్ని మెరుగుపరిచేందుకు వాడే కొన్ని పదార్థాలు ఈ రకం క్యాన్సర్‌కు అతివలను చేరువ చేస్తాయని వెల్లడైంది. 29 రకాల రసాయనాల తాకిడికి గురికావడానికి అండాశయ క్యాన్సర్‌ ముప్పునకు మధ్య ఉన్న సంబంధాన్ని ఈ పరిశోధనలో విశ్లేషించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. మేటి మేనేజ్‌మెంట్‌కి జాట్‌ మార్గం!

దేశంలో మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఎన్నో పరీక్షలున్నాయి. వాటిలో క్యాట్‌ తర్వాత ప్రాధాన్యమున్నది జేవియర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు (జాట్‌). దీన్ని జేవియర్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌, జంషెడ్‌పుర్‌ నిర్వహిస్తోంది. ఈ పరీక్ష స్కోరుతో దేశంలో 160 బిజినెస్‌ స్కూళ్లలో ఎంబీఏ/పీజీడీఎం కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చే విద్యా సంవత్సరంలో కోర్సుల్లో ప్రవేశానికి ఎక్స్‌ఏటీ-2024 ప్రకటన వెలువడింది!పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. విద్యుత్తు వాహనాలకు ప్రోత్సాహం ఉత్తిదే!

కాలుష్య నియంత్రణతో పాటు, ఇంధన వినియోగం ద్వారా పెరుగుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు విద్యుత్తు వాహనాల (ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ - ఈవీ) వాడకం ప్రత్యామ్నాయ మార్గంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్నారు. ఇదే తరహాలో రాష్ట్రంలోనూ విద్యుత్తు వాహనాల వినియోగం పెంచాలన్న లక్ష్యం అంతగా విజయవంతం కాలేదు. కానీ విద్యుత్తు ఛార్జింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తామనే పేరుతో పైసా ఖర్చు లేకుండా ప్రచారం పొందడంపై మాత్రం ప్రభుత్వం దృష్టి పెట్టింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని