Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 23 Aug 2023 09:32 IST

1. అవుటర్‌పై.. తరచూ అంధకారం

 జోరువాన, గాలులే కాకుండా ఇతర సాంకేతిక కారణాలతో తరచూ అవుటర్‌రింగ్‌రోడ్డుపై  రాత్రివేళ చీకట్లు కమ్ముకుంటున్నాయి. నగరం చుట్టూ 150 కి.మీ. మేర ఓఆర్‌ఆర్‌ విస్తరించి ఉంది. 2016 తర్వాత ఇది అందుబాటులోకి వచ్చినా ఇంటర్‌ ఛేంజ్‌లోని టోల్‌బూత్‌ల వద్ద మినహా ఎక్కడా సెంట్రల్‌ లైటింగ్‌ లేదు. ఈ క్రమంలో తరచూ ప్రమాదాలు జరిగేవి. వాహన రద్దీతో పాటు అవుటర్‌ చుట్టూ నివాస ప్రాంతాలు ఏర్పాటుకావడంతో తొలుత గచ్చిబౌలి నుంచి శంషాబాద్‌ వరకు 22 కి.మీ.మేర సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటుచేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. వ్యూహాలు.. పథకాలు

రాబోయే శాసనసభ ఎన్నికలను సమర్థంగా ఎదుర్కొని రాజధాని పరిధిలో మూడొంతుల స్థానాలను దక్కించుకోవడానికి అధికార భారాస వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. 29 నియోజకవర్గాలకుగాను ఇప్పటికే 27 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేసింది. వారంతా ఈ 3 నెలలు ప్రజల మధ్యే ఉండేలా.. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ప్రతి అభ్యర్థితోనూ పార్టీ సీనియర్‌ నాయకులు మాట్లాడుతూ సమన్వయం చేస్తున్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. వైద్యవిద్యనూ అమ్మేశారు!

సీఎం జగన్‌ ఇటీవల ఏ సభలో మాట్లాడినా తాను పేదల పక్షమని ఊదరగొడుతున్నారు...! దీనజనోద్ధారకుడు అన్నది తన ట్యాగ్‌లైన్‌ అన్నట్టుగా బిల్డప్‌ ఇస్తున్నారు...! ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కష్టం కలగకుండా, నష్టం జరగకుండా చూసుకోవడమే తన లక్ష్యం అన్నట్టుగా చెబుతున్నారు. వారి కోసమే పెత్తందారులపై తన పోరాటమని డాంబికాలు పలుకుతున్నారు. అవన్నీ మాటల వరకే..! చేతలకు వచ్చేసరికి తానే అసలు సిసలు పెత్తందారుననీ, పేదల వ్యతిరేకిననీ మరోసారి చాటుకున్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. పెత్తందారు పాలనలో.. పెట్రో పన్నుల బాదుడు

2019 ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ఎక్కడ సభ పెట్టినా పెట్రోల్‌, డీజిల్‌పై బాదుడేబాదుడంటూ ఘోషించారు కదా? పక్క రాష్ట్రాల కంటే లీటరుపై రూ.5-7 ఎక్కువని వాపోయారు కదా? ఓ అన్నా, ఓ అక్కా మీకు బైకులున్నాయా? ట్రాక్టర్లున్నాయా? పెట్రోలు, డీజిల్‌ పోయించి బిల్లులు తీసుకోండి, ఇతర రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు సరిహద్దులకు వెళ్లండంటూ ప్రేరేపించారు కదా? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. 124 ఏళ్ల నాటి వర్షాభావం

దేశంలోకి నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశించడంతో జూన్‌లో వర్షపాతం లోటు ఏర్పడింది. జులైలో అధిక వర్షాలతో ఆ లోటు తీరిపోయింది. మళ్లీ ఆగస్టు ఆరంభం నుంచి చినుకుజాడ లేదు. రుతుపవనాల గమనాన్ని ఎల్‌నినో దెబ్బతీయడంతో మందగించి వర్షాభావ పరిస్థితులు తలెత్తాయి’ అని వాతావరణశాఖ రాష్ట్ర సంచాలకురాలు నాగరత్న చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. 40 ఏళ్ల వ్యక్తిలో పురుష, స్త్రీ జననాంగాలు

ఓ వ్యక్తిలో పురుష, స్త్రీ జననాంగాలు అభివృద్ధి చెందిన అరుదైన ఘటన ఇది. వైద్యులు విజయవంతంగా వాటిని తొలగించారు. కిమ్స్‌ ఆసుపత్రి కన్సల్టెంట్‌ యురాలజిస్టు, రోబోటిక్‌ సర్జన్‌ డాక్టర్‌ వై.ఎం.ప్రశాంత్‌ వివరాలను మంగళవారం విడుదల చేశారు. ‘మంచిర్యాలకు చెందిన 40 ఏళ్ల వ్యక్తికి వివాహమై ఏళ్లు గడిచినా పిల్లలు పుట్టలేదు. ఇటీవల పొత్తి కడుపు కింద తీవ్రమైన నొప్పి రావడంతో ఆయన స్థానిక ఆసుపత్రిని సంప్రదించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆసుపత్రికి వచ్చారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. అమెరికా అధ్యక్ష రేసుకు హంగామా!

 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి పార్టీలపరమైన రాజకీయ హంగామాకు బుధవారం తెరలేవబోతోంది. విస్కాన్సిన్‌ రాష్ట్రంలో రిపబ్లికన్‌ ఆశావహులు తమ పార్టీ అభిమానులు, నిధులిచ్చే దాతల మనసు గెల్చుకునేందుకు ఫాక్స్‌ న్యూస్‌ నిర్వహించే చర్చా వేదికద్వారా తొలి ప్రయత్నం చేయబోతున్నారు. ఆశావహులైనవారు తాము బలమైన అభ్యర్థులమని ఎలుగెత్తి చాటడానికీ ఈ వేదికను వారు ఉపయోగించుకోనున్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. 2050 నాటికి ప్రపంచంలో 100 కోట్ల మందికి కీళ్లవ్యాధి

ప్రపంచంలో 2050 నాటికి రమారమి వంద కోట్ల మంది ప్రజలు కీళ్లవ్యాధితో జీవించాల్సిన పరిస్థితులు తలెత్తుతాయని ‘లాన్సెట్‌ రుమటాలజీ జర్నల్‌’లో ప్రచురితమైన పరిశోధన పత్రం చెబుతోంది. 30 ఏళ్లు, అంతకుమించిన వయసువారిలో ప్రపంచంలో 15% మంది ప్రస్తుతం ఆ సమస్యతో సతమతం అవుతున్నారు. 1990-2020 మధ్య కాలానికి సంబంధించి 200 దేశాల నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించినమీదట అధ్యయన నివేదికను రూపొందించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. బ్యాంకుకు వెళ్లకుండానే సులువుగా విద్యా రుణం!

బ్యాంకు నుంచి విద్యా రుణం తీసుకోవడమంటే మాటలా! అవసరమైన పత్రాలెన్నో   సమర్పించాలి. మంజూరవటం కోసం ఎన్ని రోజులు ఎదురుచూడాలో తెలియదు. ఇంత కష్టపడ్డా చివరికి విద్యారుణం వస్తుందో రాదో కూడా తెలియదు. ఇలాంటి సమస్యలు మీకూ అనుభవమా? మరి బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా.. దరఖాస్తు చేసిన పదిహేను రోజుల్లోనే తక్కువ వడ్డీతో రుణం మంజూరయ్యే వీలుంటే? అద్భుతంగా ఉంటుంది కదా? అయితే  ‘విద్యాలక్ష్మి’ వివరాలను తెలుసుకోవాల్సిందే! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. బోగీలు తగ్గించండి.. ట్రిప్పులు పెంచండి

ఎంఎంటీఎస్‌ ప్రయాణికులకు దూరమవుతోంది. సర్వీసులు ఎందుకు తగ్గించారనడిగితే 50 శాతం ఆదరణే అంటున్నారు. కార్యాలయాలు, విద్యాలయాల సమయాలు మినహాయిస్తే మిగతా సమయాల్లో ఖాళీగా తిరుగుతున్నాయనే సమాధానం డివిజనల్‌ రైల్వే యూజర్స్‌ కమిటీ సమావేశంలో అధికారుల నుంచి వస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని