logo

బోగీలు తగ్గించండి.. ట్రిప్పులు పెంచండి

ఎంఎంటీఎస్‌ ప్రయాణికులకు దూరమవుతోంది. సర్వీసులు ఎందుకు తగ్గించారనడిగితే 50 శాతం ఆదరణే అంటున్నారు.

Published : 23 Aug 2023 02:35 IST

ద.మ. రైల్వే అధికారులకు ప్రయాణికుల వినతి

ఈనాడు, హైదరాబాద్‌: ఎంఎంటీఎస్‌ ప్రయాణికులకు దూరమవుతోంది. సర్వీసులు ఎందుకు తగ్గించారనడిగితే 50 శాతం ఆదరణే అంటున్నారు. కార్యాలయాలు, విద్యాలయాల సమయాలు మినహాయిస్తే మిగతా సమయాల్లో ఖాళీగా తిరుగుతున్నాయనే సమాధానం డివిజనల్‌ రైల్వే యూజర్స్‌ కమిటీ సమావేశంలో అధికారుల నుంచి వస్తోంది.

రెండోదశ తోడైనా తగ్గిన రైళ్లు..

మొదటిదశ కేవలం 45 కిలోమీటర్లు. రెండో దశ తోడవ్వడంతో 100 కిలోమీటర్ల నిడివి పెరిగింది. 45 కిలోమీటర్లు తిరిగినప్పుడు 121 సర్వీసులుండేవి. అరగంటకో రైలు నడిచేది. ప్రతి 20 నిమిషాలకు అందుబాటులో ఉండేవి. కానీ ఇప్పుడు సర్వీసులు 100కే పరిమితమయ్యాయి.


అరగంటకో రైలు నడిపితే..

లింగంపల్లి - ఫలక్‌నుమా, లింగంపల్లి - ఫలక్‌నుమా - ఉందానగర్‌ మార్గంలో రద్దీగా తిరుగుతుంటాయి. ఇప్పుడు ప్రయాణికులు తగ్గారు కనుక ఈ మార్గంలో 12కు బదులు 9 బోగీలే నడిపితే సరిపోతుంది. ఎంత రద్దీ ఉన్నా మెట్రోలో 3 బోగీలతోనే రైళ్లు నడుపుతున్నట్లే.. లింగంపల్లి - హైదరాబాద్‌ మార్గంలో పీక్‌ సమయంలో 9, లేని సమయంలో 6 చొప్పున ప్రతి అరగంటకో రైలు అన్ని మార్గాల్లో నడిపి ప్రయాణికులను ఆకట్టుకోవచ్చు. వాస్తవానికి ఎంఎంటీఎస్‌ల ఆరంభంలో 6 బోగీలతోనే నడిచేవి. తర్వాత 9, ఆ తర్వాత 12 చేశారు. అంటే ఒకసారి 1500 మంది ప్రయాణించవచ్చు. ప్రయాణికులు సగానికి తగ్గినప్పుడు 6 బోగీలు నడిపితే సరిపోతుందని ప్రయాణికుల సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని