Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 11 Sep 2023 09:40 IST

1. దీక్షలు.. నిరసన జ్వాలలు

ఓ వైపు తెదేపా నేతల నిర్బంధాలు, అరెస్టులు.. మరోవైపు ఎక్కడికక్కడ పార్టీ శ్రేణుల నిరాహార దీక్షలు.. రాత్రి కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శనలు.. ఆదివారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంతటా కనిపించిన పరిస్థితి ఇది. తెదేపా అధినేత చంద్రబాబుకు అనిశా న్యాయస్థానం రిమాండ్‌ విధించిన నేపథ్యంలో 144 సెక్షన్‌తో పాటు 30 పోలీసు యాక్ట్‌ను కూడా అధికారులు తెరమీదికి తీసుకొచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. గంటలోనే ముంచేసింది

 నగరంలో ఆదివారం పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సాయంత్రం గంటపాటు కురిసిన వర్షానికి లోతట్టు దారులు చెరువుల్లా మారాయి. ఖైరతాబాద్‌ చౌరస్తా, పంజాగుట్ట, ఎర్రగడ్డ మూసాపేట, మాసాబ్‌ట్యాంక్‌ ఫ్లైఓవర్‌ పక్కన వరదతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు. వర్షం పడితే చాలు ఇక్కడ వరద పారుతోంది. కృష్ణానగర్‌లో ఎప్పటిలాగానే కాలనీ రోడ్లను వరద ముంచెత్తింది. మధ్యలో తెరపిస్తూ రాత్రి వరకు వర్షం కురుస్తూనే ఉంది. గోల్కొండ, ముషీరాబాద్‌లో గరిష్ఠంగా 4.3 సెం.మీ., సరూర్‌నగర్‌లో 4 సెం.మీ. కురిసింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. జై బోలో మట్టి గణపతికీ!

వినాయక చవితి పండగ వచ్చేస్తోంది.. మరో 10 రోజుల్లో నవరాత్రుల సంరంభం ప్రారంభం కానుంది.. విగ్రహాల విక్రయాలు జరిపే ధూల్‌పేట్‌, ఎల్బీనగర్‌, కూకట్‌పల్లి, మేడ్చల్‌, వనస్థలిపురం, నాగోల్‌ తదితర ప్రాంతాల్లో అప్పుడే సందడి కనిపిస్తోంది. మట్టి విగ్రహం కొనుగోలు చేయాలా.. ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌(పీవోపీ) విగ్రహం కొనుగోలు చేయాలా.. అని వినాయక మండపాల నిర్వాహకులు తర్జనభర్జన పడుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. అధికార పార్టీకి 144 సెక్షన్‌ వర్తించదా?

రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులనుంచి 144 సెక్షన్‌ అమల్లో ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అధికార పార్టీ నాయకులు యథేచ్ఛగా నిబంధనలను ఉల్లంఘించారు. రాజమహేంద్రవరం ఎంపీ భరత్‌రామ్‌ ఆధ్వర్యంలో పలువురు నాయకులు నగరంలో ఆదివారం ర్యాలీ నిర్వహించారు. వీరభద్రపురంలో పలువురు ఎంపీ సమక్షంలో వైకాపాలో చేరుతున్న సందర్భంగా నగరంలో ర్యాలీ సాగింది. ఆయా జంక్షన్లలో పోలీసులు మోహరించి ఉన్నప్పటికీ ర్యాలీ గురించి ప్రశ్నించలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఎన్నికల ఏర్పాట్లలో పోలీసు యంత్రాంగం

రాష్ట్ర శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పోలీసు యంత్రాంగం అందుకు సంబంధించిన బందోబస్తు ఏర్పాట్లను ముమ్మరం చేసింది. భద్రతా ఏర్పాట్ల గురించి ఇప్పటికే ఎన్నికల సంఘానికి(ఈసీ) ప్రాథమిక ప్రతిపాదనలు అందజేసింది. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం త్వరలో సమగ్ర ప్రణాళిక రూపొందించాలని పోలీసు అధికారులు భావిస్తున్నారు. తెలంగాణతోపాటు అయిదు రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నందున పోలీసు అధికారులు కేంద్ర బలగాలకు సంబంధించి ముందుగానే ప్రతిపాదనలు పంపనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. మూణ్నెల్లు దాటినా 35 శాతమే

వానాకాలం సీజన్‌ రాష్ట్రంలో ఒడిదొడుకులతో సాగుతుండగా... పంటల సాగుకు అన్నదాతలు నానా కష్టాలు పడుతున్నారు. వారికి సాయంగా నిలవాల్సిన బ్యాంకుల వైఖరి నిరాశాజనకంగా ఉంది. వ్యవసాయానికి నిర్దేశించిన లక్ష్యాల మేరకు రుణసాయం అందించాల్సి ఉన్నా దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. సీజన్‌లో మూడు నెలలు గడిచినా... ఇప్పటికి సుమారు 35 శాతం మాత్రమే రుణాలను అందించాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. అన్నం పెట్టిన రైతుకు.. కంటతడితో వానర నివాళి

సాధారణంగా కోతిని అల్లరి జంతువుగానే చూస్తాం. ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్‌ఖేరి జిల్లాలో ఓ కోతి చూపిన విశ్వాసం చర్చనీయాంశంగా మారింది. భీరా పోలీస్‌స్టేషను పరిధిలోని గోంధియా గ్రామానికి చెందిన చందన్‌వర్మ అనే రైతుకు ఊరి శివార్లలో పొలం ఉంది. రోజూ పొలం వద్ద భోజనం చేసే సమయంలో ఓ కోతి చందన్‌ దగ్గరకు వచ్చేది. ఆ ఆహారంలో నుంచే కొంత కోతికి పెట్టేవాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. 200 గంటలు.. 300 సమావేశాలు.. 15 ముసాయిదాలు..

జీ20 శిఖరాగ్ర సదస్సులో నేతల మధ్య దిల్లీ డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయం సాధించడానికి మన దౌత్యవేత్తల బృందం విశేష కృషి చేసినట్లు జీ20 భారత దేశ ప్రతినిధి(షెర్పా) అమితాబ్‌ కాంత్‌ తెలిపారు. దాదాపు 200 గంటల పాటు నిరంతర చర్చలు జరిపినట్లు ఆయన వెల్లడించారు. అదనపు కార్యదర్శులైన ఈనం గంభీర్‌, కె.నాగరాజు నాయుడితో కూడిన దౌత్యవేత్తల బృందం 300 ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహించినట్లు పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. పొట్ట దాస్తున్నారా?

ప్రసవం, కూర్చొని చేసే పని.. చాలదూ మనకు పొట్ట రావడానికి! దుస్తులపై నుంచి పొట్ట అలా కనిపిస్తుంటే ఇబ్బందే. దాన్ని దాచడానికి షేప్‌వేర్‌లపై ఆధారపడుతున్న వారెందరో. దీర్ఘకాలం వాడితే అదీ ప్రమాదమేనని తెలుసా?ఈ షేప్‌వేర్‌లను ఒకలాంటి సాగే గుణమున్న మెటీరియల్‌తో తయారు చేస్తారు. ధరించగానే ఒంటికి చక్కగా అతుక్కుపోతాయివి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. తరచూ మూడ్‌ మారుతుంటే..

తరగతిలో రోషన్‌ ఎప్పుడెలా ప్రవర్తిస్తాడో ఎవరికీ తెలియదు. సంతోషంగా నవ్వుతూ ఉన్నవాడు కాస్తా క్షణాల్లోనే ఆవేశంగా మారిపోతాడు. రేష్మి పరిస్థితీ దాదాపుగా ఇలాగే ఉంటుంది. కొన్నిసార్లు ఆకాశమే హద్దు అన్నట్టుగా పొంగిపోతూ ఉంటుంది. మరికొన్ని సార్లు కుంగిపోతూ కనిపిస్తుంది. ఎప్పుడెలా స్పందిస్తారో తెలియని వారి ప్రవర్తనతో చుట్టుపక్కలవాళ్లు ఎంతో ఇబ్బందిపడుతుంటారు కూడా.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని