పొట్ట దాస్తున్నారా?

ప్రసవం, కూర్చొని చేసే పని.. చాలదూ మనకు పొట్ట రావడానికి! దుస్తులపై నుంచి పొట్ట అలా కనిపిస్తుంటే ఇబ్బందే.

Published : 11 Sep 2023 02:11 IST

ప్రసవం, కూర్చొని చేసే పని.. చాలదూ మనకు పొట్ట రావడానికి! దుస్తులపై నుంచి పొట్ట అలా కనిపిస్తుంటే ఇబ్బందే. దాన్ని దాచడానికి షేప్‌వేర్‌లపై ఆధారపడుతున్న వారెందరో. దీర్ఘకాలం వాడితే అదీ ప్రమాదమేనని తెలుసా?

  • ఈ షేప్‌వేర్‌లను ఒకలాంటి సాగే గుణమున్న మెటీరియల్‌తో తయారు చేస్తారు. ధరించగానే ఒంటికి చక్కగా అతుక్కుపోతాయివి. తడిని పీల్చకపోవడం, వేడిని ఉత్పత్తి చేయడం.. రెండూ సూక్ష్మజీవులు పెరగడానికి అనుకూలమైనవే. దీంతో ఎక్కువసేపు ధరిస్తే జననాంగాల వద్ద ఇన్‌ఫెక్షన్లకు దారితీయొచ్చు.
  • ఎప్పుడో ఒకసారి అంటే పర్లేదు కానీ.. తరచూ వాడుతుంటే నరాలపై ఒత్తిడి పడుతుంది. చర్మం స్పర్శ కోల్పోవడం లేదా దురద, తిమ్మిర్లు వంటివీ కలుగుతాయి. ఇవన్నీ శరీరం అసౌకర్యానికి గురవుతోందనడానికి చిహ్నాలే. అలాంటప్పుడు వెంటనే తొలగించాలి.
  • పొట్టను గట్టిగా అదిమి పెట్టేస్తుంది కదా! జీర్ణప్రక్రియ సరిగా జరగక గ్యాస్‌, తేన్పులు, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి. కటి ప్రదేశంపైనా దీని ప్రభావం పడి తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది.
  • మరీ బిగుతుగా వేసుకుంటే రక్తప్రసరణకీ ఆటంకం ఏర్పడుతుంది. చర్మం పాలిపోవడమే కాదు నడుస్తోంటే నొప్పి, కళ్లు తిరగడం వంటివీ చోటు చేసుకుంటాయి. ఒక్కోసారి ప్రాణానికీ ముప్పూ ఏర్పడవచ్చు. కొనే ముందే ఒకటికి రెండుసార్లు చూసుకోవడం మేలు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్