Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 01 Dec 2023 09:20 IST

1. టీ20 ప్రపంచకప్‌.. ఆ 20 జట్లు ఇవే..

ఆతిథ్య హోదాలో వెస్టిండీస్‌, అమెరికా.. 2022 టీ20 ప్రపంచకప్‌లో టాప్‌-8లో నిలిచిన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, భారత్‌, నెదర్లాండ్స్‌, న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌, దక్షిణాఫ్రికా, శ్రీలంక.. మెరుగైన ర్యాంకింగ్‌ కలిగిన అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌ నేరుగా అర్హత సాధించాయి. క్వాలిఫయర్స్‌ ద్వారా కెనడా (అమెరికా), నేపాల్‌, ఒమన్‌ (ఆసియా), పపువా న్యూగినియా (తూర్పు ఆసియా పసిఫిక్‌), ఐర్లాండ్‌, స్కాట్లాండ్‌ (ఐరోపా), నమీబియా, ఉగాండా (ఆఫ్రికా) ఈ కప్‌లో ఆడే అవకాశాన్ని చేజిక్కించుకున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. మేమొస్తాం.. కష్టాలు తీరుస్తాం

త్మీయ పలకరింపులు.. అఖండ స్వాగతాలు.. మంగళ హారతులు.. తీన్మార్‌ డప్పులు.. తెదేపా-జనసేన జెండాల రెపరెపలు.. బాణసంచా కాల్పుల హోరు నడుమ గురువారం తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర సాగింది. కల్లుగీత కార్మికులు, రైతులు, మత్స్యకారులు, వ్యాపారులు, మహిళలు సంఘీభావంగా అడుగులు వేశారు. గత కొన్నేళ్లుగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఆయనకు వివరించారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని.. కష్టాలన్నీ తీరుస్తామని ఆయన భరోసా ఇచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ‘రౌడీ’ రాజు

యన అధికార పార్టీలో కీలక నేత. నామినేటెడ్‌ పదవిలో ఉన్నారు. విశాఖపట్నంలో(Visakhapatnam) రౌడీ సామ్రాజ్యాన్ని నెలకొల్పి, దాన్ని ‘రాజు’లా నడిపిస్తున్నారు. అరాచక శక్తులు, మాఫియా ముఠాలు, అల్లరిమూకలు, గంజాయి బ్యాచ్‌లు, కిరాయి నేరగాళ్లను పెంచి పోషిస్తూ దందాలు చేయిస్తున్నారు. నగరంలో అత్యంత ఖరీదైన, వివాదాల్లో ఉన్న స్థలాలను సెటిల్‌మెంట్లతో చేజిక్కించుకోవడం, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ముసుగులో దౌర్జన్యాలకు తెగబడటం... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. షరా మామూలే..

 తాళ్లపూడి మండలం బల్లిపాడు ఇసుక ఓపెన్‌ ర్యాంపులో అక్రమ ఇసుక దందా మళ్లీ మొదలైంది. గత నెల 28న ర్యాంపులోకి వెళ్లే రోడ్డును నీటితో తడుపుతూ వాటర్‌ ట్యాంకర్‌ డ్రైవర్‌ కె.దుర్గారావు గోదావరిలో పడి మృతిచెందారు. అప్పటి నుంచి గత నెల 30 మధ్యాహ్నం వరకు ర్యాంపులో ఇసుక సరఫరా తాత్కాలికంగా నిలిపేశారు. మళ్లీ తవ్వకాలు, తరలింపు మొదలుపెట్టారు. వందలాది లారీలు ర్యాంపులోకి తరలించి, ఇసుక లోడింగ్‌ చేసి వేరే జిల్లాలకు సరఫరా చేస్తున్నారు. పాత ఏజెన్సీ పేరుతో బిల్లులు ఇస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ప్చ్‌.. ఏం చేయాలన్నా డబ్బుల్లేవ్‌

జిల్లాలోని ఏకైక బోధనాసుపత్రిలో అన్నీ సమస్యలే. ఆవరణలోనే కుప్పలుగా వ్యర్థాలుంటాయి. వాటి తొలగింపు ఉండదు. వందల సంఖ్యలో వచ్చే రోగులకు తాగునీటి సౌకర్యం కూడా నామమాత్రం. మరుగుదొడ్ల వసతిదీ అదే దారి. ఈ సమస్యలపై అడిగితే నిధులు లేవని.. అరకొర పనులతో సరిపెట్టుకోవాల్సి వస్తోందనే సమాధానాలే ఆసుపత్రి అధికారుల నుంచి ఎదురయ్యాయి. వేసవి చెరువు నుంచి కొత్త పైపులైన్‌ ఏర్పాటు, నూతన ఎక్స్‌రే యంత్రం కొనుగోలు పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. కడగండి.. పూర్తి చేసేదెప్పుడండి..?

దిహేనేళ్ల కిందట ఎల్‌ఎన్‌పేట మండలంలో కడగండి జలాశయాన్ని నిర్మించారు. సుమారు రూ.5 కోట్లు వరకు నిధులు ఖర్చు చేశారు. కానీ దానికి అనుసంధానంగా కాలువల నిర్మాణం చేపట్టకపోవడంతో అందుబాటులోకి రాలేదు. ఫలితంగా రిజర్వాయరులో సాగునీరు ఉన్నా రైతులకు అక్కరకు రావట్లేదు. ప్రభుత్వాలు మారుతున్నా ఆ పనులకు మోక్షం కలగడం లేదని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత కాలువల నిర్మాణానికి ఒక్క రూపాయి నిధులు కూడా మంజూరు చేయలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. కోటి మాటలే.. సగం మీటలే

భారీ ఎత్తున చైతన్య కార్యక్రమాలు చేపట్టినా రాష్ట్రంలో రాజధాని పరిధిలోనే తక్కువ ఓటింగ్‌ నమోదైంది. ఎన్నికల కమిషన్‌ అధికారికంగా సెలవు ప్రకటించినా ఓటర్లు ఇళ్ల నుంచి పోలింగ్‌ బూత్‌లకు కదలిరాలేదు. రాజధాని పరిధిలోమూడు జిల్లాల్లో కోటికి పైగా ఓటర్లున్నా సగమే ఓటింగ్‌లో పాల్గొన్నారు. 2014 శాసనసభ ఎన్నికల్లో హైదరాబాద్‌ జిల్లా పరిధిలో 52.90 శాతం మంది ఓట్లేయగా 2018లో 48.89 శాతం మంది ఓటర్లే కదిలారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. మేం నిరాధార ఆరోపణలు చేయలేదు!

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీలో పియర్స్‌ కుంగడానికి గల కారణాలను వాస్తవాలను పరిగణనలోకి తీసుకొనే చెప్పామని నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ తెలిపింది. తాము నిరాధార ఆరోపణలు చేశామనడం సరైంది కాదని పేర్కొంది. ప్రాజెక్టు ప్రణాళిక, డిజైన్‌,.క్వాలిటీ కంట్రోల్‌, నిర్వహణలో లోపాలున్నాయని తేల్చిచెప్పింది. తాము లెవనెత్తిన అంశాలకు కట్టుబడి ఉన్నామని..పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఆ తర్వాత 130 కథలు విన్నా

బుల్లితెరతో ప్రేక్షకులకు చేరువయ్యారు సుడిగాలి సుధీర్‌. ఇప్పుడు కథానాయకుడిగానూ వెండితెరపై సందడి చేస్తున్నారు. ‘గాలోడు’ విజయం తర్వాత ఆయన కథానాయకుడిగా ప్రేక్షకుల ముందుకొస్తున్న చిత్రం ‘కాలింగ్‌ సహస్ర’. శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ సినిమా ప్రయాణం గురించి సుధీర్‌ గురువారం విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ..పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ప్రయాణ బీమా..క్లెయిం చేసుకోవాలంటే...

విదేశీ విహార యాత్రలకు వెళ్లాలనుకున్నప్పుడు ప్రయాణ బీమా తీసుకోవడం మంచిది. దేశం కాని దేశంలో వైద్య అవసరాలు ఏర్పడినప్పుడు, ప్రయాణం రద్దు, విమానాల ఆలస్యం, సామగ్రి, పాస్‌పోర్ట్‌ పోవడంలాంటి నష్టాలన్నింటికీ ఈ పాలసీ రక్షణ కల్పిస్తుంది. మరి అనుకోని పరిస్థితుల్లో ఈ పాలసీని క్లెయిం చేసుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకుందామా.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని