Top 10 News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 14 Sep 2023 21:07 IST

1. ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌

తెదేపా అధినేత చంద్రబాబుకు బెయిల్‌ ఇవ్వాలంటూ ఏసీబీ కోర్టులో న్యాయవాది గింజుపల్లి సుబ్బారావు పిటిషన్‌ దాఖలు చేశారు. చంద్రబాబుపై సీఐడీ మోపిన అభియోగాలు నిరాధారమని పేర్కొంటూ సుబ్బారావు ఈ పిటిషన్ వేశారు. చంద్రబాబు పేరు ఎఫ్‌ఐఆర్‌లో లేకుండానే రిమాండ్‌ రిపోర్టులో ఏ37గా పేర్కొంటూ సీఐడీ ఈ కేసు దర్యాప్తు చేస్తోందన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. దిల్లీకి బయలుదేరి వెళ్లిన నారా లోకేశ్‌..

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ దిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఎంపీ రామ్మోహన్‌ నాయుడుతో కలిసి రాజమహేంద్రవరం నుంచి ఆయన దిల్లీకి వెళ్లారు. తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో రాష్ట్ర పరిస్థితులను జాతీయ స్థాయిలో లోకేశ్‌ వివరించనున్నారు. అలాగే చంద్రబాబు కేసు విషయమై సుప్రీంకోర్టు న్యాయవాదులతో చర్చించనున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. పవన్‌ ప్రకటనను స్వాగతించిన తెదేపా, జనసేన శ్రేణులు

తెలుగుదేశం - జనసేన పొత్తును సైకిల్ శ్రేణులు స్వాగతించాయి. రాక్షస సంహారం కోసం శక్తులు ఒక్కటి అయ్యాయని తెదేపా నేతలు తెలిపారు. పొత్తులో భాగంగా ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని స్పష్టం చేశారు. ఓ కమిటీ ఏర్పాటు చేసుకుని అందుకు తగ్గట్టుగా ఐక్య కార్యాచరణ ప్రకటించుకుంటామని వెల్లడించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం..

భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులు, ఉరుములతో కురిసిన వర్షానికి వివిధ పనులపై బయటకు వచ్చిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై వాన నీరు చేరడంతో వాహనదారులు, బాటసారులు ఇబ్బందులు పడ్డారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఈడీ నోటీసును సీరియస్‌గా తీసుకోవద్దు: ఎమ్మెల్సీ కవిత

దిల్లీ మద్యం కుంభకోణం (Delhi Liquor scam) కేసులో ఈడీ నోటీసులపై భారాస ఎమ్మెల్సీ కవిత స్పందించారు. నిజామాబాద్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నాకు మోదీ నోటీసు వచ్చింది. రాజకీయ కక్షసాధింపులో భాగంగా వచ్చిన నోటీసు అది. నోటీసును పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు’’ అని కొట్టిపారేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. డెంగీ కేసులు పెరుగుదల ప్రచారంలో వాస్తవం లేదు: వైద్యారోగ్యశాఖ

రాష్ట్రంలో డెంగీ కేసులు పెరుగుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తెలంగాణ వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు ఒక్క మరణం కూడా నమోదు కాలేదని ప్రకటించింది. ఫీవర్ కేసులు కూడా ఆందోళనకర స్థాయిలో లేవని స్పష్టం చేసింది. రాష్ట్రంలో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సీజనల్‌ వ్యాధుల పరిస్థితిపై వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఏపీ మాజీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ కుమారుడిపై కేసు నమోదు

ఏపీ మాజీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ కుమారుడు డేవిడ్‌ సవాంగ్‌పై హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఓ పబ్‌ వద్ద ఇరువర్గాల మధ్య జరిగిన దాడికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్‌లో రోడ్డు నెంబర్‌ 10లోని పబ్బు వద్ద సమద్‌, సిద్దార్ధ వర్గాల మధ్య యువతి విషయంలో గొడవ జరిగింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. భారీ వర్షం.. రన్‌వేపై జారిన విశాఖ- ముంబయి విమానం!

ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయం (Mumbai Airport)లో ప్రమాదం చోటుచేసుకుంది. విశాఖపట్నం నుంచి ముంబయికి బయల్దేరిన వీఎస్‌ఆర్‌ వెంచర్స్‌కు చెందిన ఓ ప్రైవేటు విమానం (Learjet 45) ఇక్కడ ల్యాండ్‌ అవుతుండగా.. ప్రమాదవశాత్తు రన్‌వేపై జారి (Runway Excursion), పక్కకు దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో విమానంలో ఆరుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. చంద్రయాన్‌-3 ‘రికార్డు’ అద్భుతం.. యూట్యూబ్‌ సీఈఓ

భారత్‌ జాబిల్లిపైకి పంపిన చంద్రయాన్-3(Chandrayaan-3) విజయవంతం కావడంతో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. ఈ ప్రయోగంతో సోషల్ మీడియాలో నమోదైన ఓ రికార్డు గురించి యూట్యూబ్ సీఈఓ నీల్‌ మోహన్(YouTube chief Neal Mohan) స్పందించారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO)కు అభినందనలు తెలియజేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ‘విండో సీట్‌’ నుంచి క్లిక్‌.. సింగిల్‌ ఫ్రేమ్‌లో అంతరిక్షం-భూమి!

అంతరిక్షానికి సంబంధించిన ఎన్నో విశేషాలు, కీలక సమాచారాన్ని అమెరికా స్పేస్‌ ఏజెన్సీ (NASA) తెలియజేస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా పంపించిన ఫొటోలను తన సామాజిక మాధ్యమ వేదికలో పోస్టు చేసింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్తున్న సమయంలో స్పేస్‌ఎక్స్‌ డ్రాగన్‌ ఎండ్యూరాన్స్‌లోని కిటికీ నుంచి వ్యోమగాములు తీసిన అద్భుతమైన ఫొటో ఎంతగానో ఆకట్టుకుంటోంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని