Top 10 News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 28 Feb 2024 21:04 IST

1. తెదేపా-జనసేన విన్నింగ్‌ టీమ్‌: చంద్రబాబు

కూటమిలో ఎవరు ఎక్కువ.. తక్కువ కాదని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజల కోసం కలిసి అడుగులు వేస్తున్నామన్నారు. తాడేపల్లిగూడెంలో తెదేపా-జనసేన ఉమ్మడి సభలో ఆయన మాట్లాడారు. ‘‘తెదేపా-జనసేన దెబ్బకు ఫ్యాన్‌ ముక్కలై పోవాలి. పొత్తు గెలవాలి.. రాష్ట్రం నిలవాలి. ఆంధ్రప్రదేశ్‌ ఇక అన్‌స్టాపబుల్‌. తెదేపా అగ్నికి పవన్‌ వాయువులా తోడయ్యారు’’ అని చెప్పారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. గాయత్రి మంత్రం కూడా 24 అక్షరాలే: పవన్‌ కల్యాణ్‌

ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని వర్గాలను జగన్‌ మోసం చేశారని, సిద్ధం అంటున్న ఆయనకు యుద్ధం ఇద్దామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. ‘‘24 సీట్లేనా అని అవతలి పక్షం విమర్శించింది. బలి చక్రవర్తి కూడా వామనుడిని చూసి ఇంతేనా అన్నారు. నెత్తిన కాలుపెట్టి తొక్కితే ఎంతో అని తెలిసింది’’ అని చెప్పారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఘోర రైలు ప్రమాదం.. 12 మంది దుర్మరణం!

ఝార్ఖండ్‌లో ఘోర రైలు ప్రమాదం (Jharkhand Train Accident) చోటుచేసుకుంది.  రైల్వే ట్రాక్‌ దాటుతున్న వ్యక్తులను బెంగళూరు -భాగల్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు  ఢీకొట్టింది.  ఈ దుర్ఘటనలో 12 మంది దుర్మరణం చెందినట్లు సమాచారం. అనసోల్‌ పరిధి జంతారా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. భారాస మేడిగడ్డ పర్యటనకు కేసీఆర్‌ సైతం వెళ్లాలి: మంత్రి ఉత్తమ్‌

భారాస నేతల మేడిగడ్డ బ్యారేజీ పర్యటనను స్వాగతిస్తున్నామని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు. ఇంత భారీగా అవినీతి చేసి కూడా మేడిగడ్డకు వెళ్తామంటున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌ జలసౌధలో ఆయన మాట్లాడారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ‘ప్రజాతీర్పును అణచివేసే ప్రయత్నం’.. భాజపాపై ప్రియాంక ఫైర్‌

ధన బలం, కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగంతో ప్రజల తీర్పును తుంగలోకి తొక్కి, హిమాచల్‌ ప్రదేశ్‌ (Himachal Pradesh)లో రాజకీయ సంక్షోభం సృష్టించేందుకు భాజపా (BJP) ప్రయత్నిస్తోందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) ఆరోపించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఈనాడు కార్యాలయంపై దాడి.. స్పందించిన ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా

ఈనాడు (Eenadu) కార్యాలయంపై దాడి ఘటనపై ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (PCI) స్పందించింది. కర్నూలులో జరిగిన ఈ ఘటనను సుమోటోగా స్వీకరించింది. దాడిపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ నెల 20న కర్నూలులోని ఈనాడు కార్యాయంలపై వైకాపా కార్యకర్తలు దాడికి తెగబడిన విషయం తెలిసిందే.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. తెలంగాణలో ఐదుగురు ఐఏఎస్‌ల బదిలీ

తెలంగాణలో ఐదుగురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్‌ కలెక్టర్‌గా రాహుల్‌ రాజ్‌, ఆదిలాబాద్‌ కలెక్టర్‌గా రాజర్షి, కుమురంభీమ్‌ ఆసిఫాబాద్‌ కలెక్టర్‌గా స్నేహ శబరీశ్‌, హైదరాబాద్‌ అదనపు కలెక్టర్‌గా హేమంత కేశవ పాటిల్‌ను బదిలీ చేసింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. అరకు కాఫీ ‘నచ్చిందండీ.. గర్వంగా ఉంది’: చంద్రబాబు ప్రశ్నకు భువనేశ్వరి జవాబు

‘నిజం గెలవాలి’ పర్యటనలో భాగంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు (Chandrababu) సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) బుధవారం అరకు నియోజకవర్గంలో పర్యటించారు. అక్కడి కాఫీ (Araku coffee)ని రుచి చూశారు. స్థానిక తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి దొన్నుదొర ఈ కాఫీ గొప్పతనాన్ని ఆమెకు వివరించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్‌లు.. ఇషాన్‌, శ్రేయస్ ఔట్‌

భారత క్రికెట్‌ బోర్డు 2023-24 సీజన్‌కు సీనియర్‌ క్రికెటర్ల వార్షిక ఒప్పందాలను ప్రకటించింది. జాతీయ జట్టుకు ఆడనపుడు దేశవాళీ టోర్నీల్లో కచ్చితంగా పాల్గొనాలని బీసీసీఐ తేల్చి చెప్పింది. అందరూ అనుకున్నట్లుగానే ఈసారి ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌ను కాంట్రాక్టుల నుంచి తొలగించింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. రిలయన్స్‌, డిస్నీ డీల్‌ ఖరారు.. ఒకే గొడుకు కిందకు 120 ఛానెళ్లు

ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, వాల్ట్‌ డిస్నీ మధ్య ఒప్పందం కుదిరింది. తమ మీడియా వ్యాపారాలైన వయాకామ్‌ 18, స్టార్‌ ఇండియా విలీనానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇరు సంస్థలు కలిసి రూ.70,352 కోట్ల విలువైన జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటుకు నిర్ణయించాయి. సంయుక్త సంస్థలో రిలయన్స్‌ రూ.11,500 కోట్లు పెట్టుబడి పెట్టనుంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని