Top 10 News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 22 Mar 2024 21:02 IST

1. దిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు 6 రోజుల ఈడీ కస్టడీ

దిల్లీ మద్యం విధానం కేసులో ఆప్‌ జాతీయ కన్వీనర్‌, ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)ను 6 రోజుల ఈడీ కస్టడీకి రౌస్‌ అవెన్యూ కోర్టు అనుమతించింది. దీంతో ఈ నెల 28 వరకు కేజ్రీవాల్‌ను ఈడీ కస్టడీలోకి తీసుకొని విచారించనుంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. కేజ్రీవాల్‌ అరెస్టు.. ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజు: కేసీఆర్‌

దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ అరెస్టు రాజకీయ ప్రేరేపితమని భారాస అధినేత కేసీఆర్‌ అన్నారు. ఆయన అరెస్టు.. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజుగా అభివర్ణించారు. ప్రతిపక్షాలను లేకుండా చేయాలనే ఏకైక లక్ష్యంతో భాజపా పనిచేస్తోందని విమర్శించారు. హేమంత్‌ సోరెన్‌, కవిత అరెస్టులు ఇందుకు నిదర్శనమన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ప్రధాని మోదీకి భూటాన్‌ అత్యున్నత పౌర పురస్కారం..

భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) శుక్రవారం భూటాన్‌ (Bhutan) అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్‌ ఆఫ్‌ ది డ్రూక్‌ గ్యాల్పో’ను అందుకున్నారు. భూటాన్‌ రాజు జిగ్మే ఖేసర్‌ నాంగ్యేల్‌ వాంగ్‌చుక్‌ దీన్ని ప్రదానం చేశారు. దీంతో ఈ పురస్కారాన్ని అందుకున్న తొలి విదేశీ ప్రభుత్వాధినేతగా నిలిచారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. టీఎస్‌ ఐసెట్‌, ఈఏపీసెట్‌ షెడ్యూల్‌లో మార్పు

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పలు ప్రవేశ పరీక్షల తేదీల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. టీఎస్‌ ఈఏపీ సెట్‌తో పాటు ఐసెట్‌ పరీక్షలను రీషెడ్యూల్‌ చేస్తూ తెలంగాణ ఉన్నత విద్యామండలి శుక్రవారం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఎయిరిండియాకు డీజీసీఏ రూ.80 లక్షల జరిమానా

ఎయిరిండియా (Air India) విమానయాన సంస్థకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (DGCA) శుక్రవారం పెద్ద మొత్తంలో జరిమానా విధించింది. పౌర విమానయాన నిబంధనలను (CAR) ఉల్లంఘించిన కారణంగా రూ.80 లక్షలు జరిమానా విధించినట్లు డీజీసీఏ పేర్కొంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. 25వేల కేజీల డ్రగ్స్‌.. సంధ్య ఆక్వా పరిశ్రమలో సీబీఐ దాడులు

కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం మూలపేటలో ఉన్న సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌ పరిశ్రమలో సీబీఐ దాడులు ముగిశాయి. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి ఏడుగురు సీబీఐ అధికారుల బృందం వివిధ భాగాల్లో తనిఖీలు నిర్వహించారు.  ఇప్పటికే పరిశ్రమలో పనిచేస్తున్న సిబ్బంది, కూలీల నుంచి వివరాలు సేకరించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఆ ఇద్దరు ఎమ్మెల్సీలను అనర్హులుగా ప్రకటించండి: భారాస

ఎమ్మెల్సీలు కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డిపై భారాస అనర్హత పిటిషన్‌ దాఖలు చేసింది. శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డిని కలిసిన ఆ పార్టీ శాసనసభాపక్షం ఈమేరకు ఫిర్యాదు చేసింది. భారాస తరఫున శాసనమండలికి ఎన్నికై, క్రమ శిక్షణకు విరుద్ధంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న దామోదర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి సభ్యత్వాలు రద్దు చేయాలని నేతలు కోరారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. వైకాపా తాయిలాలు.. గుంటూరులో 12 మంది వాలంటీర్లపై వేటు

నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న 12 మంది వాలంటీర్లపై ఎన్నికల సంఘం సస్పెన్షన్‌ వేటు వేసింది. వివరాల్లోకి వెళితే.. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాత ఈనెల 19న ప్రత్తిపాడు వైకాపా అభ్యర్థి బలసాని కిరణ్‌ కుమార్‌.. గుంటూరు గ్రామీణ మండల పరిధిలోని వాలంటీర్లతో తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఏసీబీ వలలో మానుకోట సబ్‌రిజిస్ట్రార్‌ తస్లీమా

లంచం తీసుకుంటూ మహబూబాబాద్‌ సబ్‌రిజిస్ట్రార్‌ తస్లీమా ఏసీబీకి రెండ్‌ హ్యాండెడ్‌గా చిక్కారు. వివరాల్లోకి వెళ్తే.. దంతాలపల్లి మండలం దాట్ల గ్రామానికి చెందిన హరీశ్‌ ఇటీవల 128 గజాల స్థలం కొనుగోలు చేశారు. రిజిస్ట్రేషన్‌ కోసం గజానికి రూ.200 లంచం ఇవ్వాలని రిజిస్ట్రార్‌ తస్లీమా డిమాండ్‌ చేశారు. అంత ఇచ్చుకోలేనని చెప్పి గజానికి రూ.150 చొప్పున ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నాడు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. రైలును నెట్టిన కార్మికులు... వైరలైన వీడియో

రైల్వే కార్మికులు ఒక బోగితో ఉన్న రైలును నెడుతూ తీసుకెళ్తున్న వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే... ఉత్తరప్రదేశ్‌లోని అమేఠీ, నిహాల్‌ఘఢ్ రైల్వేస్టేషన్‌ల సమీపంలో రైలు బ్రేకులు పనిచేయక ఆగిపోయింది. రైల్వే సిబ్బంది దాన్ని బాగు చేసేందుకు ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని