కేజ్రీవాల్‌ అరెస్టు.. ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజు: కేసీఆర్‌

దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ అరెస్టు రాజకీయ ప్రేరేపితమని భారాస అధినేత కేసీఆర్‌ అన్నారు.

Updated : 22 Mar 2024 20:12 IST

హైదరాబాద్‌: దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ అరెస్టు రాజకీయ ప్రేరేపితమని భారాస అధినేత కేసీఆర్‌ అన్నారు. ఆయన అరెస్టు.. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజుగా అభివర్ణించారు.  ప్రతిపక్షాలను లేకుండా చేయాలనే ఏకైక లక్ష్యంతో భాజపా పనిచేస్తోందని విమర్శించారు. హేమంత్‌ సోరెన్‌, కవిత అరెస్టులు ఇందుకు నిదర్శనమన్నారు. ఈడీ, సీబీఐ, ఐటీలను కేంద్రం పావులుగా వాడుకుంటోందని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు లాంటి చర్యలను భారాస తీవ్రంగా ఖండిస్తోందన్నారు. అక్రమ కేసులను వెనక్కి తీసుకొని, అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

మద్యం విధానంతో ముడిపడిన మనీలాండరింగ్‌ కేసులో అరవింద్‌ కేజ్రీవాల్‌ను గురువారం రాత్రి ఆయన అధికార నివాసంలో ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో దర్యాప్తు సంస్థ చేపట్టిన ఈ చర్యను ఆప్‌ నేతలతో పాటు విపక్షాలు తీవ్రంగా ఖండించాయి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని