Guntur: వైకాపా తాయిలాలు.. గుంటూరులో 12 మంది వాలంటీర్లపై వేటు

గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న 12 మంది వాలంటీర్లపై ఎన్నికల సంఘం సస్పెన్షన్‌ వేటు వేసింది.

Updated : 22 Mar 2024 19:44 IST

గుంటూరు: నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న 12 మంది వాలంటీర్లపై ఎన్నికల సంఘం సస్పెన్షన్‌ వేటు వేసింది. వివరాల్లోకి వెళితే.. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాత ఈనెల 19న ప్రత్తిపాడు వైకాపా అభ్యర్థి బలసాని కిరణ్‌ కుమార్‌.. గుంటూరు గ్రామీణ మండల పరిధిలోని వాలంటీర్లతో తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. వారిని ప్రలోభ పెట్టేందుకు నగదుతో పాటు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. బలసాని.. వాలంటీర్లతో సమావేశమైన విషయం తెలుసుకున్న తెదేపా నాయకులు అక్కడికి వెళ్లడంతో వారిపై దాడి చేశారు. ఈ ఘటన గుంటూరులో ఉద్రిక్తతకు దారితీసింది. ప్రలోభాల పర్వంపై ఫిర్యాదులు అందడంతో ఈసీ స్పందించింది. నగర పాలక సంస్థల పరిధిలోని 12 మంది వాలంటీర్లను విధుల నుంచి తొలగిస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని