TS CETs: టీఎస్‌ ఐసెట్‌, ఈఏపీసెట్‌ షెడ్యూల్‌లో మార్పు

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో టీఎస్‌ ఐసెట్‌, ఈఏపీ సెట్‌ షెడ్యూల్‌ మార్చినట్లు ఉన్నత విద్య మండలి ప్రకటించింది.

Updated : 22 Mar 2024 18:09 IST

హైదరాబాద్‌: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పలు ప్రవేశ పరీక్షల తేదీల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. టీఎస్‌ ఈఏపీ సెట్‌తో పాటు ఐసెట్‌ పరీక్షలను రీషెడ్యూల్‌ చేస్తూ తెలంగాణ ఉన్నత విద్యామండలి శుక్రవారం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది. 

మారిన షెడ్యూల్‌ ఇలా..

  • గతంలో ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం.. మే 9 నుంచి 12 వరకు జరగాల్సిన ఈఏపీసెట్‌ మే 7 నుంచి 11వరకు రీ షెడ్యూల్‌. 
  • మే 7, 8 తేదీల్లో అగ్రికల్చరల్‌, ఫార్మసీ పరీక్షలు.
  • మే 9, 10, 11 తేదీల్లో ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షలు.
  • జూన్‌ 4, 5న జరగాల్సిన ఐసెట్‌ జూన్‌ 5, 6 తేదీలకు మార్పు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని