Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 03 Apr 2024 20:59 IST

1. వాలంటీరు వ్యవస్థకు నేను వ్యతిరేకం కాదు: చంద్రబాబు

‘‘వాలంటీరు వ్యవస్థకు నేను వ్యతిరేకం కాదు. వారు రాజకీయం చేయడానికి నేను వ్యతిరేకం. వాలంటీర్లంతా తటస్థంగా ఉండాలి. వారికి న్యాయం చేస్తాం’’అని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్న ఆయన.. కొత్తపేటలో నిర్వహించిన ‘ప్రజాగళం’ సభలో పాల్గొని ప్రసంగించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. సంగారెడ్డి జిల్లాలో అగ్ని ప్రమాదం.. పరిశ్రమ డైరెక్టర్ సహా ఐదుగురి మృతి

సంగారెడ్డి జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. హత్నూర మండలం చందాపూర్‌ గ్రామ శివారులో ఉన్న ఎస్‌బీ ఆర్గానిక్‌ పరిశ్రమలో బాయిలర్‌ పేలి మంటలు చెలరేగాయి. పేలుడు ధాటికి భవనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో పరిశ్రమ డైరెక్టర్‌ రవితో పాటు మరో నలుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. 3 రాజధానుల శిబిరం ఎత్తేసి.. తెదేపాలో చేరిన వైకాపా నేతలు

వైకాపా నేతలు అమరావతిలో 3 రాజధానుల శిబిరం ఎత్తేసి.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. నాలుగేళ్లుగా మందడం సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు వద్ద 3 రాజధానుల శిబిరం నిర్వహిస్తున్న వైకాపా అనుబంధ బహుజన పరిరక్షణ సమితి నేతలు కేశినేని చిన్ని ఆధ్వర్యంలో లోకేశ్‌ను కలిసి తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. థియేటర్ల వద్ద డ్యూటీలు వేస్తారు.. పింఛన్ల పంపిణీకి సిబ్బంది లేరా?: పవన్‌

‘‘ఏపీ సీఎస్‌ గారూ.. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఇళ్ల వద్దే పింఛను అందించడానికి ఉన్న ఇబ్బంది ఏంటి. నా సినిమా రిలీజ్‌ అయితే థియేటర్స్‌ దగ్గర రెవెన్యూ ఉద్యోగులకు డ్యూటీలు వేస్తారు.. తహసీల్దార్‌ ఫోన్‌ నంబరు ఇస్తారు. కానీ, పింఛన్లు ఇవ్వడానికి ఉద్యోగులు లేరా’’అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ‘ఎక్స్‌’ వేదికగా ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. కాంగ్రెస్‌ ‘ఘర్‌ ఘర్‌ గ్యారెంటీ’ ప్రచారం మొదలు..!

ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ బుధవారం నుంచి ఘర్‌ ఘర్‌ గ్యారెంటీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రజలకు పార్టీ ప్రకటించిన ‘పాంచ్‌ న్యాయ్‌, పచ్చీస్‌ గ్యారెంటీ’ (ఐదు న్యాయాలు, 25 హామీలు) దేశంలోని ప్రతీ ఇంటికీ తెలియజేయడమే దీని లక్ష్యం. ఈ కార్యక్రమాన్ని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ఈశాన్య దిల్లీలోని ఉస్మాన్‌పుర్‌, కైత్వాడలో ప్రారంభించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. అమ్మ మాట వినిపిస్తే, కలైంజర్ కళ్ల ముందు కనిపిస్తే..! ఎన్నికల ప్రచారంలో ఏఐ వింతలు

తమిళ ప్రజల ‘అమ్మ’ జయలలిత ఈ సార్వత్రిక ఎన్నికల్లో అన్నాడీఎంకే తరఫున ప్రచారం చేస్తేనో..! తన కుమారుడు ఎంకే స్టాలిన్ సీఎంగా సాధించిన ఘనతలను కలైంజర్‌ కరుణానిధి మనముందుకొచ్చి చెప్తేనో..!! అదంతా ఏఐ మాయే! ఈ సాంకేతికతతో అధికార, ప్రత్యర్థి పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. భాజపాలో చేరికపై సుమలత ప్రకటన.. కుమారస్వామికి మద్దతు

లోక్‌సభ ఎన్నికల వేళ మాండ్య స్వతంత్ర ఎంపీ, సీనియర్‌ నటి సుమలత కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను భాజపాలో చేరుతున్నట్లు ప్రకటించారు. అలాగే, ఈ ఎన్నికల్లో మాండ్య నుంచి ఎన్డీయే అభ్యర్థిగా బరిలో వున్న జేడీఎస్‌ నేత కుమారస్వామికి మద్దతు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఈవీఎంలపై వీడియో.. యూట్యూబర్‌ అరెస్టు

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నెట్టింట తప్పుడు సమాచారం ఈసీ (EC)కి తలనొప్పిగా మారింది. అసత్య ప్రచారాల వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఈవీఎం (EVM)లపై నకిలీ వార్తలను ప్రచారం చేస్తున్న ఓ యూట్యూబర్‌ను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. గిఫ్ట్‌గా 20,000 ఏనుగులను పంపమంటారా: జర్మనీని హెచ్చరించిన బోట్సువానా

జర్మనీ ముచ్చటపడితే 20,000 ఏనుగులను గిఫ్ట్‌గా ఇస్తామని బోట్సువానాఅధ్యక్షుడు మసిసి హెచ్చరించారు. ఈ ఏడాది ప్రారంభంలో జర్మనీ పర్యావరణ మంత్రిత్వ శాఖ హంటింగ్‌ ట్రోఫీలపై కఠిన ఆంక్షలు విధించే అంశాన్ని ప్రతిపాదించింది. దీనిపై బోట్సువానా అధ్యక్షుడు మండిపడ్డారు. ఆ చర్య తమ దేశాన్ని మరింత పేదరికంలోకి నెడుతుందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. సైన్యంలోకి యువ రక్తం!.. నిర్బంధ వయసు 25కు తగ్గించిన ఉక్రెయిన్‌

రష్యా దురాక్రమణతో కుదేలవుతోన్న ఉక్రెయిన్‌.. రెండేళ్లకు పైగా పుతిన్‌ సేనలతో పోరాడుతూనే ఉంది. దీంతో సైనిక, ఆర్థిక నష్టాలను తీవ్ర స్థాయిలో చవిచూసింది. ఈ క్రమంలో కోల్పోయిన సైనిక శక్తిని భర్తీ చేసేందుకు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం సైనిక నిర్బంధ వయసును 27 నుంచి 25కు తగ్గించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని