Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 15 May 2024 21:05 IST

1.  చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి

చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం మొగలిఘాట్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్‌, రెండు లారీలు ఢీకొని ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.  పూర్తి కథనం

2. టీమ్‌ఇండియా కొత్త కోచ్‌ రేసులో స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌.. సీఎస్కే స్పందనిదే

టీమ్‌ ఇండియా కొత్త కోచ్‌ వేటలో బీసీసీఐ పడింది. ఆ బాధ్యతల్లో ఉన్న రాహుల్‌ ద్రవిడ్‌ ఇకముందు కొనసాగేందుకు ఇష్టం చూపడం లేదు. ఎన్‌సీఏ డైరెక్టర్‌ హోదాలో పనిచేస్తున్న వీవీఎస్‌ లక్ష్మణ్‌ పేరు కూడా ఈ రేసులో ఉంది. మరోవైపు విదేశీ కోచ్‌లను నియమించుకునే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు ఇటీవల బీసీసీఐ వెల్లడించిన నేపథ్యంలో సీఎస్కే హెడ్‌ కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ పేరు బలంగా వినిపిస్తోంది. పూర్తి కథనం 

3. స్లొవేకియా ప్రధానిపై కాల్పులు..

స్లొవేకియా ప్రధాని రాబర్ట్‌ ఫికోపై ఓ దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయనను ఆస్పత్రికి తరలించారు. హాండ్లోవాలో కేబినెట్‌ మీటింగ్‌లో పాల్గొని తిరిగివస్తుండగా ఓ దుండగుడు కాల్పులు జరిపినట్లు సమాచారం. పూర్తి కథనం 

4. టెలికాం టారిఫ్‌లు మన దగ్గరే తక్కువ: ఎయిర్‌టెల్ సీఈఓ

 ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే దేశీయ టెలికాం మార్కెట్‌లోనే టారిఫ్‌లు బాగా తక్కువని భారతీ ఎయిర్‌టెల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ గోపాల్‌ విత్తల్‌ అన్నారు. పెట్టిన పెట్టుబడికి ప్రతిఫలం పెరగాలంటే ‘టారిఫ్‌ రిపేర్‌’ అవసరమన్నారు. పరోక్షంగా ధరల పెంపు చేపట్టబోతున్నట్లు సంకేతాలిచ్చారు. క్యూ4 ఎర్నింగ్‌ కాల్‌ సందర్భంగా ఆయన ఈమేరకు మాట్లాడారు. పూర్తి కథనం

5. సైలెంట్‌ ఓటింగ్ భారాసకే అనుకూలం: కేటీఆర్‌

లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో భారాస అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ అభ్యర్థులు, వివిధ జిల్లాల నేతలతో ఆయన సమీక్ష నిర్వహించారు. తమ నియోజకవర్గాల్లో పోలింగ్ సరళిని ఈ సందర్భంగా నేతలు కేటీఆర్‌కు వివరించారు. సైలెంట్‌ ఓటింగ్ ఎక్కువగా జరగడం వల్ల ఫలితాలు భారాసకే అనుకూలంగా ఉంటాయని పలు సర్వే సంస్థలు చెప్పినట్లు కేటీఆర్ పేర్కొన్నారు.   పూర్తి కథనం

6. కార్చిచ్చుల వేళ.. అగ్నిమాపక సిబ్బందికి ఎన్నికల విధులా..?

సార్వత్రిక ఎన్నికల వేళ ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం తీరుపై భారత సర్వోన్నత న్యాయస్థానం మరోసారి మండిపడింది. భారీ స్థాయిలో చెలరేగుతున్న అటవీ మంటలను అరికట్టే ప్రయత్నాలపై అసహనం వ్యక్తంచేసింది.  పూర్తి కథనం

7. మళ్లీ కలిసిన కేఎల్ - సంజీవ్ గోయెంకా.. అభిమానికి గంభీర్‌ స్వీట్‌ రిప్లయ్‌!

మ్యాచ్‌ అనంతరం లఖ్‌నవూ సారథి కేఎల్ రాహుల్‌తో ఆ ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్‌ గోయెంకా సీరియస్‌గా మాట్లాడుతూ కనిపించారు. చీవాట్లు పెడుతున్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్లతో క్రికెట్ అభిమానులు హోరెత్తించారు. పూర్తి కథనం

8. అసలైన విజయమంటే అదే.. బర్త్‌డే రోజు రామ్‌ ఆసక్తికర పోస్ట్‌

‘డబుల్‌ ఇస్మార్ట్‌’ టీజర్‌తో ఫ్యాన్స్‌లో జోష్‌ పెంచారు రామ్ పోతినేని. నేడు ఈ యంగ్‌ హీరో పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులకు ధన్యవాదాలు చెబుతూ రామ్ (Ram pothineni) కూడా ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు.  పూర్తి కథనం

9. తెలంగాణలో వర్సిటీల ఉపకులపతుల నియామకానికి ఈసీ అనుమతి

రాష్ట్రంలో ఉన్నత విద్యాశాఖ పరిధిలోని 10 విశ్వవిద్యాలయాలకు కొత్త ఉపకులపతు(వీసీ)ల నియామకానికి ఎన్నికల కమిషన్‌ అనుమతిచ్చింది. దీంతో షెడ్యూల్‌ ప్రకారమే వీసీల నియామకం జరుగుతుందని విద్యాశాఖ కార్యదర్శి తెలిపారు. పూర్తి కథనం

10. ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతిస్తాం: మమతా బెనర్జీ

ఎన్నికల అనంతరం ఇండియా కూటమి అధికారంలోకి వస్తే దానికి బయటినుంచి మద్దతిస్తానని బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఎన్నికల్లో సీట్ల పంపకాలపై కాంగ్రెస్‌తో విభేదాలు తలెత్తడంతో ఇండియా కూటమికి కొంతకాలంగా దీదీ దూరంగా ఉన్నారు.  పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని