icon icon icon
icon icon icon

KTR: సైలెంట్‌ ఓటింగ్ భారాసకే అనుకూలం: కేటీఆర్‌

లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో భారాస అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

Published : 15 May 2024 20:18 IST

హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో భారాస అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ అభ్యర్థులు, వివిధ జిల్లాల నేతలతో ఆయన సమీక్ష నిర్వహించారు. తమ నియోజకవర్గాల్లో పోలింగ్ సరళిని ఈ సందర్భంగా నేతలు కేటీఆర్‌కు వివరించారు. సైలెంట్‌ ఓటింగ్ ఎక్కువగా జరగడం వల్ల ఫలితాలు భారాసకే అనుకూలంగా ఉంటాయని పలు సర్వే సంస్థలు చెప్పినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. 

కేసీఆర్ బస్సుయాత్ర తర్వాత క్షేత్రస్థాయిలో మార్పు వచ్చిందన్నారు. మెదక్, నాగర్ కర్నూల్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, కరీంనగర్, ఖమ్మం స్థానాల్లో గెలుపు ఖాయమని చెప్పారు. ఒక్క నల్గొండలో మాత్రమే కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందని అన్నారు. పెద్దపల్లిలో కాంగ్రెస్ పార్టీ విపరీతంగా డబ్బులు పంచిందని ఆరోపించారు. తాను సిరిసిల్లలో ఐదుసార్లు గెలిచినా ఒక్కసారి కూడా డబ్బులు పంచలేదని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఉపఎన్నిక కోసం నల్గొండ, వరంగల్, ఖమ్మం పరిధిలోని నేతలు పూర్తి స్థాయిలో పనిచేయాలని.. పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలని ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img