icon icon icon
icon icon icon

Mamata Banerjee: ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతిస్తాం: మమతా బెనర్జీ

సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే దానికి తమ పార్టీ సహకారం అందిస్తుందని బెంగాల్‌ ముఖ్యమమంత్రి మమతా బెనర్జీ అన్నారు.

Published : 15 May 2024 19:55 IST

కోల్‌కతా: ఎన్నికల అనంతరం ఇండియా కూటమి అధికారంలోకి వస్తే దానికి బయటినుంచి మద్దతిస్తానని బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఎన్నికల్లో సీట్ల పంపకాలపై కాంగ్రెస్‌తో విభేదాలు తలెత్తడంతో ఇండియా కూటమికి కొంతకాలంగా దీదీ దూరంగా ఉన్నారు. 

బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ‘‘మేము ఇండియా కూటమికి బయటినుంచే అన్నివిధాలుగా సాయం చేస్తాం. మా నాయకత్వం అందిస్తాం. బెంగాల్‌లో మేము ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తాం. దీనివల్ల ఏ ఒక్క తల్లీ, చెల్లీ  సమస్యలను ఎదుర్కోరు. 100 రోజుల ఉద్యోగ పథకం ద్వారా ఉపాధి పొందుతున్నవారు ఇబ్బందులకు గురికారు ’’ అని తెలిపారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అధీర్ చౌదరి నేతృత్వంలోని సీపీఎం, బెంగాల్ కాంగ్రెస్ ఇండియా కూటమితో లేవని, అవి భాజపాతో జత కట్టాయని దీదీ మండిపడ్డారు. 

దేశంలోని 70 శాతం సీట్లకు ఎన్నికలు పూర్తికాగా మరో మూడు రౌండ్ల ఎన్నికలు మిగిలిఉన్నాయి. కాగా బెంగాల్‌లో ప్రతీ దశలోనూ ఓటింగ్ జరుగుతుంది.  అధికార భాజపా దక్షిణాది నుంచి 370 స్థానాల్లో విజయం సాధించాలని చూస్తోంది. ఎన్నికల వేళ ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్రమంత్రి అమిత్ షా రాష్ట్రంలోని 42 లోక్‌సభ స్థానాలపై దృష్టి సారించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img