Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 19 May 2024 21:03 IST

1. తెలంగాణ మంత్రివర్గ భేటీకి ముహూర్తం ఖరారు

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ భేటీకి ముహూర్తం ఖరారైంది. సోమవారం మధ్యాహ్నం 3గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్నారు. కేబినెట్‌ భేటీకి ఎన్నికల సంఘం(ఈసీ) అనుమతి ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. శనివారమే మంత్రివర్గ భేటీ నిర్వహించాల్సి ఉండగా.. ఈసీ అనుమతి ఇవ్వలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. నరసరావుపేటలో రెండో రోజు సిట్‌ దర్యాప్తు.. పోలీస్ స్టేషన్‌కు మంత్రి అంబటి

పోలింగ్‌ రోజు, ఆ తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక దాడులు, ఘర్షణలపై పల్నాడు జిల్లాలో సిట్‌ దర్యాప్తు రెండో రోజు కొనసాగుతోంది. శనివారం అర్ధరాత్రి వరకు నరసరావుపేట రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో విచారణ కొనసాగగా.. ఇవాళ గ్రామీణ పోలీస్‌ స్టేషన్‌లో ఏసీబీ అడిషినల్‌ ఎస్పీ సౌమ్యలత నేతృత్వంలో సిట్‌ అధికారులు ముమ్మర విచారణ చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. తెలంగాణలో పలు చోట్ల వర్షం.. పిడుగుపాటుకు ముగ్గురి మృతి

తెలంగాణలో పలు చోట్ల వర్షం కురుస్తోంది. వికారాబాద్‌ జిల్లాలోని యాలాల మండలం పరిధిలో రెండు చోట్ల పిడుగులు పడటంతో ముగ్గురు మృత్యువాత పడ్డారు. జంటుపల్లిలో పిడుగుపడి శ్రీనివాస్‌, లక్ష్మమ్మ మృతి చెందారు. బెన్నూరులో వెంకప్ప ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. వైకాపా ఆధ్వర్యంలో పోస్టల్‌ బ్యాలెట్ల తరలింపు.. కూటమి అభ్యర్థుల ఆందోళన

పోస్టల్‌ బ్యాలెట్‌ వ్యవహారంపై అనుమానాలు కలుగుతున్నాయని, అధికారులు తీరు చూస్తే అర్థమవుతుందని విజయనగరం నియోజకవర్గ కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు కలిశెట్టి అప్పలనాయుడు, పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు ఆరోపించారు. విజయనగరంలో అధికారుల తీరును మీడియాకు వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్‌ మండిపాటు

మైదానంలో ఆటగాళ్ల మధ్య ఏ చిన్న విషయం చోటుచేసుకున్నా.. కెమెరాలు రికార్డు చేస్తున్నాయి. మైదానంలో ఆటగాళ్ల సంభాషణలు రికార్డు చేయడంపై ముంబయి మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఇలాంటి చర్యలు ఆటగాళ్ల గోప్యతకు భంగం కలిగిస్తాయని ఎక్స్‌(ట్విటర్‌)లో అసంతృప్తి వ్యక్తం చేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. రాయ్‌బరేలీలో రాహుల్‌ పోటీ.. సోనియాపై ప్రధాని విమర్శలు

కాంగ్రెస్‌ కంచుకోటగా పేరొందిన రాయ్‌బరేలీ నుంచి ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ పోటీకి దిగడంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. తన కుమారుడి కోసం ఆ ప్రాంత ప్రజలను ఓట్లు అడిగిన సోనియా గాంధీపై విమర్శలు గుప్పించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. పార్లమెంటు భద్రత.. రంగంలోకి 3300 మంది ‘సీఐఎస్‌ఎఫ్‌’ సిబ్బంది

పార్లమెంటు సమగ్ర భద్రత బాధ్యతలు ఇక పూర్తిస్థాయిలో ‘సెంట్రల్‌ ఇండస్ట్రీయల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (CISF)’ నిర్వహించనుంది. సీఐఎస్‌ఎఫ్‌ ఉగ్రవాద నిరోధక భద్రత విభాగానికి చెందిన 3300 మందికిపైగా సిబ్బంది సోమవారం (మే 20) నుంచి విధులు నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. భార్య, కుమారుడు వేధిస్తున్నారు, భరణం ఇప్పించండి - మాజీ మంత్రి వేడుకోలు

రాజస్థాన్‌లో భరత్‌పుర్‌ రాజకుటుంబంలో మళ్లీ రగడ మొదలైంది. మాజీ ఎంపీ దివ్యా సింగ్‌, తనయుడు అనిరుధ్‌ తనని వేధిస్తున్నారంటూ మాజీ మంత్రి విశ్వేంద్ర సింగ్‌ వాపోయారు. తనపై దాడి చేశారని, సరైన తిండి కూడా పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తనకు భరణం ఇప్పించాలని కోరుతూ స్థానిక న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. అందుకే భారత్‌తో వాణిజ్య బంధం తెగిపోయింది: పాక్‌

పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాక్ దిగుమతులపై భారత్‌ అధిక సుంకాలు విధించడం ప్రారంభించిందని ఆ దేశ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్‌ దర్‌ తెలిపారు. అందుకే ఇరు దేశాల మధ్య వాణిజ్య బంధం నిలిచిపోయిందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆ దేశ నేషనల్‌ అసెంబ్లీకి శనివారం ఆయన రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఇరాన్‌ అధ్యక్షుడి హెలికాప్టర్‌కు ప్రమాదం..!

ఇరాన్‌ (Iran) అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తోన్న హెలికాప్టర్‌ ప్రమాదానికి గురైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే అది కూలిపోయి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తూర్పు అజర్‌బైజాన్‌ ప్రావిన్స్‌లోని జోల్ఫా సమీపంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారిక మీడియా వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని