Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 27 Mar 2024 21:34 IST

1. ఏపీలో భాజపా అసెంబ్లీ అభ్యర్థులు వీరే..

ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను భాజపా విడుదల చేసింది. తెదేపా, జనసేనతో పొత్తులో భాగంగా ఆ పార్టీకి 6 లోక్‌సభ, 10 అసెంబ్లీ స్థానాలు కేటాయించిన విషయం తెలిసిందే. ఇప్పటికే భాజపా ఐదో జాబితాలో ఆరుగురు ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. తాజాగా పది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. పెద్దిరెడ్డికి ఇసుకే అల్పాహారం.. మైన్స్‌ మధ్యాహ్న భోజనం: చంద్రబాబు

దుర్మార్గాలు చేసేవారిని శాశ్వతంగా వదిలించుకునే సమయం ఆసన్నమైందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. మదనపల్లెలో నిర్వహించిన ‘ప్రజాగళం’ సభలో పాల్గొని ప్రసంగించారు. సంపద సృష్టించడం తెలిసిన కూటమి ఎన్డీయేనేనని, తాము అధికారంలోకి వస్తే సంపదను సృష్టించి ప్రజలకు పంచుతామని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. హైకోర్టుల్లోనూ మౌలిక సౌకర్యాల కొరత: సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌

ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువయ్యేలా మార్పులు రావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ఆకాంక్షించారు. రాజేంద్రనగర్‌లో తెలంగాణ నూతన హైకోర్టు భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. కింది కోర్టుల్లోనే కాదు.. హైకోర్టుల్లోనూ మౌలిక సౌకర్యాల కొరత ఉందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. దిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌కు దక్కని ఊరట

మద్యం విధానం కేసులో అరెస్టయిన ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు దిల్లీ హైకోర్టులో ఊరట లభించలేదు. ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాల్‌ చేస్తూ ఆయన వేసిన పిటిషన్‌పై బుధవారం విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. ఆయనకు మధ్యంతర ఉపశమనం కల్పించేందుకు నిరాకరించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఒక్క ఓటరు కోసం.. 39 కి.మీ. ట్రెక్కింగ్‌కు పోలింగ్‌ సిబ్బంది రెడీ!

ప్రజాస్వామ్య పండగగా పరిగణించే ఎన్నికల్లో ప్రతిఒక్క ఓటరును భాగస్వామిని చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెబుతోన్న ఎన్నికల సంఘం.. మారుమూల ప్రాంతాల్లోనూ పోలింగ్‌ కేంద్రాలను అందుబాటులో ఉంచుతోంది. ఈక్రమంలో అరుణాచల్‌ ప్రదేశ్‌లోని ఓ మారుమూల గ్రామంలో ఓ మహిళా ఓటరు కోసం పోలింగ్‌ సిబ్బంది దాదాపు 39 కి.మీ.ల దూరం ట్రెక్కింగ్‌ చేసేందుకు సిద్ధమయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. మమత, కంగనలపై వ్యాఖ్యల దుమారం.. దిలీప్‌ ఘోష్‌, సుప్రియా శ్రీనేత్‌లకు ఈసీ షోకాజ్‌ నోటీసులు

లోక్‌సభ ఎన్నికల వేళ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భాజపా ఎంపీ దిలీప్‌ ఘోష్‌, కాంగ్రెస్‌ నాయకురాలు సుప్రియా శ్రీనేత్‌లకు కేంద్ర ఎన్నికల సంఘం షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.  బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీకి వ్యతిరేకంగా దిలీప్‌ ఘోష్‌, భాజపా అభ్యర్థి కంగనా రనౌత్‌పై అభ్యంతరకర పోస్టు పెట్టినందుకు సుప్రియా శ్రీనేత్‌లకు నోటీసులు పంపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఆరు నెలల్లో.. రూ.7.5 లక్షల కోట్ల రుణానికి కేంద్రం సిద్ధం

ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడంతో పాటు రెవెన్యూ లోటు భర్తీ చేయడానికి మార్కెట్‌ నుంచి రుణ సమీకరణకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌-సెప్టెంబర్‌ మధ్య కాలానికి దాదాపు రూ.7.5 లక్షల కోట్లు సమీకరించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. భారత్‌ - పాక్‌ ద్వైపాక్షిక సిరీస్‌ల నిర్వహణకు ఆసీస్‌ ఆసక్తి!

భారత్‌ - పాక్‌ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌ను తమ దేశంలో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని క్రికెట్‌ ఆస్ట్రేలియా మరోసారి వెల్లడించింది. ఐసీసీ వరల్డ్‌ కప్‌, ఛాంపియన్స్‌ ట్రోఫీలు మినహా దాయాది దేశాల మధ్య 2012-13 నుంచి ఇప్పటివరకూ ఎటువంటి మ్యాచ్‌లు జరగలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. లీడర్‌ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ

జనసేన పార్టీ కోసం ప్రచారం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు నటి అనసూయ తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. జబర్దస్త్‌ ఎందుకు మానేయాల్సి వచ్చిందో చెప్పారు. అలాగే పొలిటికల్‌ పార్టీలపైనా స్పందించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది ‘రాజకీయ ప్రతీకారమే’ - ఆప్‌

దేశ రాజధానిలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది ‘రాజకీయ ప్రతీకారమే’ అని స్పష్టంగా అర్థమవుతుందని ఆమ్‌ఆద్మీ పార్టీ (AAP) పేర్కొంది. జైలు నుంచే ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పాలన కొనసాగిస్తారని ఆప్‌ నేతలు చేస్తున్న ప్రకటనలపై లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా స్పందిస్తూ.. దిల్లీ పాలన అలా నడవదన్నారు. ఎల్‌జీ చేసిన ఈ ప్రకటనపై దిల్లీ మంత్రి అతిశీ మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని