ట్రంప్ కనీస విధుల్నీ నిర్వర్తించలేదు: కమలా హారిస్
వాషింగ్టన్: అమెరికా ప్రజల శ్రేయస్సు పట్ల అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర నిర్లక్ష్యపూరిత వైఖరి ప్రదర్శించారని డెమొక్రటిక్ పార్టీ తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటీ పడుతున్న కమలా హారిస్ ఆరోపించారు. ప్రజల సంక్షేమం కోసం పనిచేయడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారని దుయ్యబట్టారు. ఓ అధ్యక్షుడిగా నిర్వహించాల్సిన కనీసం విధుల్ని కూడా ఆయన సమర్థంగా చేపట్టలేకపోయారన్నారు. కొవిడ్ కట్టడి విషయంలో తీవ్ర అశ్రద్ధ వహించారని విమర్శించారు. గురువారం ‘రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్’లో ట్రంప్ కీలక ‘యాక్సెప్టెన్స్ స్పీచ్’కి కొన్ని గంటల ముందు కమల ఈ విమర్శలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
అధ్యక్షుడిగా అమెరికా ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తానంటూ దేవుడి సాక్షిగా ప్రజల సమక్షంలో చేసిన ప్రమాణాన్ని ట్రంప్ ఏమాత్రం గుర్తెరిగి ప్రవర్తించలేదని కమలా హారిస్ విమర్శించారు. ప్రజల్ని రక్షించుకోవడం ఆయన విధి అని.. కానీ, దాన్ని నిర్వర్తించడంలో ట్రంప్ ఘోరంగా విఫలమయ్యారన్నారు. ట్రంప్ తన అసమర్థతను బటయపెట్టుకోవడం కొత్తేమీ కాదని విమర్శించారు. కానీ, జనవరిలో ప్రపంచాన్నే కబళించే వైరస్ వెలుగులోకి వచ్చినపుడు ఆయన అసమర్థత మరింత శృతిమించిందన్నారు. వైరస్ ముప్పుని నిరాకరిస్తూ పెద్ద తప్పిదానికి పాల్పడ్డారన్నారు. ‘వైరస్‌కు భయపడాల్సిన అవసరం లేదు.. త్వరలో వైరస్ అంతం చేసే అద్భుతం జరగబోతోంది..’ వంటి వ్యాఖ్యలతో ప్రజల్ని మోసం చేశారన్నారు.
మరోవైపు డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష రేసులో ఉన్న జో బైడెన్ మాత్రం ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసే ప్రయత్నం చేశారని కమలా హారిస్ చెప్పుకొచ్చారు. ముందు చూపుతో వ్యవహరించిన బైడెన్.. మహమ్మారిని ఎదుర్కొనేందుకు పటిష్ఠ ప్రణాళిక అవసరమని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వచ్చారన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Ap-top-news News
AP TET: పార్వతీపురం అభ్యర్థికి చెన్నైలో టెట్ పరీక్ష కేంద్రం
-
Ts-top-news News
NIT Warangal: 3 వేలలోపు ర్యాంకులకే కంప్యూటర్ సైన్స్ సీటు
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (11/08/2022)
-
India News
75th Independence Day: ఎర్రకోట వేడుకల్లో.. అత్యాధునిక తుపాకులతో ‘గన్ సెల్యూట్’
-
World News
Death Valley: డెత్ వ్యాలీలో వరద బీభత్సం.. అరుదైన వర్షపాతం నమోదు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (11/08/2022)
- Prashant Kishor: నీతీశ్ అందుకే భాజపాను వీడారు..!
- Viral Video: చీమల్ని తిన్న వీడియోకు 10మిలియన్ల వ్యూస్!
- రైలెక్కించి పంపారు.. కాగితాల్లో చంపారు
- Rohit sharma: ఈ ప్లాన్‌తోనే భారత క్రికెట్‌కు మంచి భవిష్యత్‌ను అందిస్తాం: రోహిత్ శర్మ
- Aamir Khan: ‘గత 48గంటల నుంచి నేను నిద్రపోలేదు’ : ఆమిర్‌ఖాన్
- Death Valley: డెత్ వ్యాలీలో వరద బీభత్సం.. అరుదైన వర్షపాతం నమోదు
- Shilpa Shetty: చిత్రీకరణలో గాయపడ్డ శిల్పాశెట్టి
- Pancreatitis: కడుపులో నొప్పిగా ఉంటుందా..? ఇది ఎలా వస్తుందో తెలుసా..
- సెక్స్ కోరే అమ్మాయిలు వేశ్యలతో సమానం: నటుడు వివాదాస్పద వ్యాఖ్యలు