DRDO Drone: పొలాల్లో కుప్పకూలిన డీఆర్‌డీవో డ్రోన్‌

డీఆర్‌డీవోకు చెందిన డ్రోన్‌ కర్ణాటకలోని పొలాల్లో కుప్పకూలింది. ఈ ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తున్నట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.

Published : 20 Aug 2023 13:27 IST

బెంగళూరు: రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ (DRDO)కు చెందిన డ్రోన్‌ (Unmanned Aerial Vehicle) ఆదివారం కర్ణాటకలో కుప్పకూలింది. చిత్రదుర్గ జిల్లా హరియూర్‌ తాలుకాలోని వడ్డికెరె గ్రామంలోని పొలాల్లో డ్రోన్‌ కూలిపోయినట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. కూలిన డ్రోన్‌ను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున ప్రమాద స్థలానికి చేరుకున్నారు.

రాహుల్‌కు ధన్యవాదాలు తెలిపిన కేంద్ర మంత్రి.. ఎందుకంటే?

గత కొంత కాలంగా డీఆర్‌డీవో యూఏవీల అభివృద్ధిపై పరిశోధనలు చేస్తోంది. తపస్‌ (TAPAS) పేరుతో రూపొందిస్తున్న ఈ డ్రోన్‌ను ఆదివారం ఉదయం డీఆర్‌డీవో పరీక్షిస్తుండగా కూలిపోయినట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం గురించి రక్షణ శాఖకు సమాచారం అందించినట్లు వెల్లడించారు. డ్రోన్‌ కూలిపోవడానికి గల కారణాలను విశ్లేషిస్తున్నట్లు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని