రామ మందిరానికి ప్రముఖుల విరాళాలు

అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ రూ.5,00,100 చెక్కును శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రతినిధులకు శుక్రవారం అందజేశారు. ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, ఆయన సతీమణి ఉష ఇప్పటికే రూ.5,11,116 మొత్తాన్ని ఆలయ నిర్మాణానికి విరాళమిచ్చారు.

Updated : 16 Jan 2021 14:09 IST

దిల్లీ: అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ రూ.5,00,100 చెక్కును శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రతినిధులకు శుక్రవారం అందజేశారు. ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, ఆయన సతీమణి ఉష ఇప్పటికే రూ.5,11,116 మొత్తాన్ని ఆలయ నిర్మాణానికి విరాళమిచ్చారు. ఉత్తరాఖండ్‌ గవర్నర్‌ బేబీ రాణి మౌర్య రూ.1.21 లక్షలు, ముఖ్యమంత్రి త్రివేందర్‌ సింగ్‌ రావత్‌ రూ.1.51 లక్షలు, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ రూ.లక్ష చెక్కును ఈ నిధికి అందజేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే సురేంద్ర బహదూర్‌ సింగ్‌ రూ.1,11,11,111 భారీ విరాళం అందజేశారు. మందిరం నిర్మాణాన్ని పూర్తిగా దేశ ప్రజల విరాళాలతోనే నిర్మించాలని ట్రస్టు భావిస్తోంది. దేశవ్యాప్తంగా శుక్రవారం నుంచి విరాళాల సేకరణ మొదలయింది. ఫిబ్రవరి 27 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని