Omicron: గతంలోనే కరోనా సోకినా.. ఒమిక్రాన్‌తో ముప్పే!

గతంలో కరోనా బారిన పడ్డవారికి ప్రస్తుతం ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకదని అపోహపడొద్దని తాజా అధ్యయనమొకటి హెచ్చరించింది. మునుపటి ఇన్‌ఫెక్షన్‌ తాలూకు రక్షణ వ్యవస్థను కొత్త వేరియంట్‌ తప్పించుకోగలుగుతోందని పేర్కొంది.

Updated : 04 Dec 2021 07:22 IST

ది హేగ్‌: గతంలో కరోనా బారిన పడ్డవారికి ప్రస్తుతం ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకదని అపోహపడొద్దని తాజా అధ్యయనమొకటి హెచ్చరించింది. మునుపటి ఇన్‌ఫెక్షన్‌ తాలూకు రక్షణ వ్యవస్థను కొత్త వేరియంట్‌ తప్పించుకోగలుగుతోందని పేర్కొంది. ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో దక్షిణాఫ్రికాలో విట్‌వాటర్స్‌రాండ్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. అంతకుముందే కరోనా బారిన పడ్డవారికి.. డెల్టా సహా ఇతర వేరియంట్లు సోకే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లు వారు తెలిపారు. మునుపటి ఇన్‌ఫెక్షన్‌తో ఏర్పడిన రక్షణ వ్యవస్థను ఒమిక్రాన్‌ బురిడీ కొట్టించే అవకాశాలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నట్లు తేలిందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని