సులువుగా కీమోథెరపీ ఔషధం తయారీ

క్యాన్సర్‌ బాధితులకు ఇచ్చే కీమోథెరపీ ఔషధాల తయారీకి ఉపయోగపడే పాలీఆరిల్‌క్వినోన్‌ అనే పదార్థాన్ని సులువుగా రూపొందించే ప్రక్రియ సిద్ధమైంది. దిల్లీలోని ఐఐటీ పరిశోధకులు దీన్ని అభివృద్ధి చేశారు. పాలీఆరిల్‌క్వినోన్‌ను ఔషధాలు, ఆప్టోఎలక్ట్రానిక్స్‌, బయో ఇమేజింగ్‌ వంటి రంగాల్లో

Published : 06 Jul 2022 03:19 IST

ఐఐటీ-దిల్లీ పరిశోధకుల ఘనత

దిల్లీ: క్యాన్సర్‌ బాధితులకు ఇచ్చే కీమోథెరపీ ఔషధాల తయారీకి ఉపయోగపడే పాలీఆరిల్‌క్వినోన్‌ అనే పదార్థాన్ని సులువుగా రూపొందించే ప్రక్రియ సిద్ధమైంది. దిల్లీలోని ఐఐటీ పరిశోధకులు దీన్ని అభివృద్ధి చేశారు. పాలీఆరిల్‌క్వినోన్‌ను ఔషధాలు, ఆప్టోఎలక్ట్రానిక్స్‌, బయో ఇమేజింగ్‌ వంటి రంగాల్లో ఉపయోగిస్తుంటారు. అయితే దీని తయారీ చాలా సవాళ్లతో కూడుకున్న వ్యవహారం. ఇందులో సంక్లిష్టమైన అనేక దశలు ఉంటాయి. క్వినోన్‌లకు ఫల్వీన్‌ను జోడించడం ద్వారా పాలీఆరిల్‌క్వినోన్‌ను సులువుగా తయారుచేయవచ్చని ఐఐటీ శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ చర్యలో పలాడియం లోహాన్ని ఉత్ప్రేరకంగా ఉపయోగించారు. ‘‘ఆరిల్‌క్వినోన్‌ ఆధారిత కీమోథెరపీ ఔషధాలు ఇప్పటికే మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. మేం రూపొందించిన పదార్థం మెరుగైన ఫలితాలను ఇస్తోంది. గతంలో కనుగొన్న ఆరిక్వినోన్‌ డాక్సోరుబిసిన్‌ ఔషధంతో పోలిస్తే ఇందులో ‘సైటోటాక్సిసిటీ’ అధికం. ఇది క్యాన్సర్‌ చికిత్సకు ఉపయోగపడుతుంది. తాజాగా ఉపయోగించిన ఆధునిక విధానం వల్ల అనేక కొత్త రసాయనాలను తయారుచేయవచ్చు’’ అని పరిశోధన బృందానికి నాయకత్వం వహించిన రవి పి సింగ్‌ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని