లోదుస్తులు తీసేస్తేనే నీట్‌ పరీక్షకు అనుమతి!

కేరళలో నీట్‌ పరీక్షకు హాజరైన పలువురు విద్యార్థినులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. పరీక్ష కేంద్రంలోకి వెళ్లే ముందు నిర్వహించే తనిఖీల్లో భాగంగా లోదుస్తులను విప్పాలని సిబ్బంది బలవంతం చేసినట్లు కొందరు విద్యార్థినులు ఆరోపించారు.

Published : 19 Jul 2022 03:57 IST

 కేరళలోని కొల్లం జిల్లాలో విద్యార్థినులకు ఇబ్బందులు..

కొల్లాం: కేరళలో నీట్‌ పరీక్షకు హాజరైన పలువురు విద్యార్థినులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. పరీక్ష కేంద్రంలోకి వెళ్లే ముందు నిర్వహించే తనిఖీల్లో భాగంగా లోదుస్తులను విప్పాలని సిబ్బంది బలవంతం చేసినట్లు కొందరు విద్యార్థినులు ఆరోపించారు. కొల్లం జిల్లా ఆయుర్‌లోని మార్థోమా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో ఈ ఘటన జరిగింది. దేశవ్యాప్తంగా ఆదివారం నీట్‌ పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. పరీక్షా హాల్‌కు వెళ్లిన తమకు    లో దుస్తులు విప్పాలని సిబ్బంది సూచించారని బాధిత యువతి పేర్కొంది. లోదుస్తులు తీసేసిన తర్వాతే అనుమతించారని తెలిపింది. తనిఖీల సమయంలో బ్రాకు ఉన్న హుక్స్‌ కారణంగా సౌండ్‌ వచ్చిందని దీంతో దాన్ని తీసేసి తన కుమార్తెను పరీక్షా కేంద్రంలోకి వెళ్లాలని సిబ్బంది ఆదేశించారని యువతి తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.  మరోవైపు.. ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని కళాశాల యాజమాన్యం వివరణ ఇచ్చింది. బయోమెట్రిక్‌ తనిఖీలు చేసే బాధ్యత ఏజెన్సీలదేనని పేర్కొంది. కాగా, ఆదివారం పరీక్ష పూర్తయిన అనంతరం పెద్దఎత్తున లోదుస్తులను ఓ అట్ట పెట్టెలో కళాశాల సిబ్బంది బయట పడేసినట్లు కొందరు విద్యార్థులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని