‘పేదలకు రిజర్వేషన్‌’ అంశంపై నేడు సుప్రీంకోర్టు విచారణ ప్రత్యక్ష ప్రసారం

సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చేపట్టే విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముందుగా పేదలకు (ఈడబ్ల్యూఎస్‌) 10% రిజర్వేషన్‌; వివిధ సేవలపై

Published : 27 Sep 2022 05:14 IST

దిల్లీ: సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చేపట్టే విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముందుగా పేదలకు (ఈడబ్ల్యూఎస్‌) 10% రిజర్వేషన్‌; వివిధ సేవలపై కేంద్రం-దిల్లీ ప్రభుత్వాల నియంత్రణకు సంబంధించి మంగళవారం నుంచి వెబ్‌కాస్ట్‌ ద్వారా విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.  అంతకుముందు ఉదయం... సుప్రీంకోర్టు విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేసే విషయమై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌, జస్టిస్‌ ఎస్‌.రవీందర్‌ భట్‌, జస్టిస్‌ జేబీ పార్దీవాలాలతో కూడిన ధర్మాసనం స్పందించింది. రాజ్యాంగ ధర్మాసనం చేపట్టే విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు సొంత ప్లాట్‌ఫాంను వినియోగిస్తామని తెలిపింది. యూట్యూబ్‌ ద్వారా ప్రసారాలు తాత్కాలికమేనని స్పష్టం చేసింది. భాజపా మాజీ నేత కేఎన్‌ గోవిందాచార్య ఈ అంశంపై దాఖలుచేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రత్యక్ష ప్రసారాల విషయంలో సర్వోన్నత న్యాయస్థానం తన కాపీరైట్‌ను ప్రైవేటు వేదికలకు ఇవ్వరాదని పిటిషనర్‌ అభ్యర్థించారు. ప్రత్యక్ష ప్రసారాల కార్యక్రమం ప్రారంభదశలో ఉందని, కాపీరైట్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటామని ధర్మాసనం హామీ ఇచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని