జమ్మూకశ్మీర్‌లో బస్సు పేలుళ్లు

జమ్మూకశ్మీర్‌లోని ఉధంపుర్‌ నగరంలో కొన్ని గంటల వ్యవధిలో జరిగిన జంట పేలుళ్లతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. నిలిపి ఉంచిన బస్సుల్లో జరిగిన ఈ పేలుళ్లతో ఎవరికీ ప్రాణాపాయం లేకున్నా, ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. నగరంలోని

Published : 30 Sep 2022 04:28 IST

ఉలిక్కిపడ్డ ఉధంపుర్‌

జమ్ము/ఉధంపుర్‌: జమ్మూకశ్మీర్‌లోని ఉధంపుర్‌ నగరంలో కొన్ని గంటల వ్యవధిలో జరిగిన జంట పేలుళ్లతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. నిలిపి ఉంచిన బస్సుల్లో జరిగిన ఈ పేలుళ్లతో ఎవరికీ ప్రాణాపాయం లేకున్నా, ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. నగరంలోని దోమేల్‌ కూడలి వద్ద ఉన్న పెట్రోలుబంకు సమీపంలో పార్కింగు చేసిన ఓ బస్సులో బుధవారం రాత్రి తొలి పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. గురువారం ఉదయం 5.30 ప్రాంతంలో స్థానిక బస్‌స్టాండులో నిలిపి ఉంచిన నైట్‌హాల్టు బస్సులో రెండో పేలుడు జరిగింది. ఈ సారి ఎవరూ గాయపడకపోయినా.. పేలుడు ధాటికి బస్సు టాపు, వెనుక భాగం ఊడిపడ్డాయి. ఉధంపుర్‌ - రియాసీ రేంజి డీఐజీ సులేమాన్‌ చౌధరి మాట్లాడుతూ.. ‘ఉగ్రవాద కోణాన్ని కాదనలేం. విచారణ కొనసాగుతోంది’ అని తెలిపారు. అక్టోబరు తొలివారంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పర్యటన ఉన్న నేపథ్యంలో జరిగిన ఈ పేలుళ్లతో జనం ఉలిక్కిపడ్డారు. ఉధంపుర్‌, జమ్ము జిల్లాల్లో ప్రజలు పాకిస్థాన్‌ వ్యతిరేక ప్రదర్శనలతో రాస్తారోకోలు నిర్వహించారు. కాంగ్రెస్‌, శివసేన పార్టీలతోపాటు భజరంగ్‌ దళ్‌, డోగరా ఫ్రంట్‌ ఈ పేలుళ్లను ఖండించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని