Published : 09/08/2020 00:39 IST

భయపడినట్లే జరిగింది..

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: కేరళలోని కొలికోడ్‌ విమానాశ్రయంలో జరిగిన విమాన ప్రమాదాన్ని గతంలోనే ఊహించామని వైమానిక రంగ నిపుణులు వెల్లడించారు. ఈ విమానాశ్రయం కొండలపై ఉందని, రన్‌వేకు ఇరువైపులా లోయలున్నాయని వారు గుర్తు చేశారు. దీనికి తోడు లైటింగ్‌ కూడా ఎక్కువగా ఉండదని వారు చెప్పారు. దీనిపై గతంలోనే తాము అనేకసార్లు సంబంధిత అధికారవర్గాలకు  విజ్ఞప్తి చేసినా వారు పట్టించుకోలేదన్నారు.

అదే జరిగివుంటే ప్రాణనష్టం ఎక్కువగా ఉండేది..

విమానం రన్‌వే చివరకు వెళ్లి రెండు ముక్కలుగా విడిపోయింది. అయితే అదృష్టవశాత్తు మంటలు రాలేదు. ఒక వేళ మంటలు ఏర్పడివుంటే ప్రాణనష్టం ఎక్కువగా ఉండేది. 2010లో మంగళూరు విమానాశ్రయంలో ఇదే తరహా ప్రమాదం జరగ్గా మంటలు రావడంతో ఎక్కువమంది ప్రాణాలు కోల్పోయారు. విమానాలు రన్‌వేలపై దిగే సమయంలో టైర్లలోని కొన్ని రబ్బరు శకలాలు కిందపడుతుంటాయి. వర్షంతో ఇవి రన్‌వేను మరింత జారుడుగా మారుస్తాయి. కొలికోడ్‌ విమానాశ్రయంలో భారీ వర్షంతో రన్‌వే మరింత జారుడుగా మారింది. దీంతో పాటు రన్‌వే ఏటవాలుగా ఉండటంతో విమానం రన్‌వే నుంచి జారిపోయివుండవచ్చని విమానయాన నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మలబార్‌ ప్రజలకు సౌకర్యంగా..
రాష్ట్రంలో తిరువనంతపురం, కొచి, కొలికోడ్‌, కన్నూర్‌లో అంతర్జాతీయ విమానాశ్రయాలున్నాయి. ఒక రాష్ట్రంలో నాలుగు అంతర్జాతీయ విమానాశ్రయాలున్న రాష్ట్రం కేరళ ఒక్కటే. రాష్ట్రంలోని ఉత్తర ప్రాంతాన్ని మలబార్‌గా వ్యవహరిస్తారు. పోర్చుగీస్‌ యాత్రికుడు వాస్కోడిగామా తొలిసారిగా కొలికోడ్‌లోని కప్పాడ్‌ బీచ్‌లో 1498లో అడుగుపెట్టాడు.  ఉత్తర జిల్లాలైన కాసర్‌గోడ్‌, వయనాడ్‌, కొలికోడ్‌, కన్నూర్‌, మల్లపురం జిల్లాలకు ఈ విమానాశ్రయం సౌకర్యంగా ఉంటుంది. గల్ఫ్‌లో ఉంటున్న  ఈ ప్రాంతాలకు చెందిన లక్షలాదిమంది ప్రవాస భారతీయులకు ఈ విమానాశ్రయం సేవలందిస్తోంది. కొన్ని సంవత్సరాల క్రితం కన్నూర్‌లో కొత్త విమానాశ్రయం నిర్మించడంతో దీనిపై ఒత్తిడి తగ్గింది.

Read latest Latest News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని