
Viral Video: ‘క్వార్టర్’ అంటే 30ఎంఎల్ సర్..
ఓ ఆన్లైన్ క్లాస్‌లో టీచర్- స్టూడెంట్ మధ్య జరిగిన ఫన్నీ సంభాషణ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆ వీడియోకు లక్షల వ్యూస్ వచ్చాయి. ట్విటర్లో వీడియోపై మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఆన్లైన్ సీఏ క్లాసు జరుగుతుండగా.. ‘క్వార్టర్లో ఎంత ఉంటుంది? హత్విక్.. ఒక్క క్వార్టర్లో ఎంత ఉంటుంది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు’ అంటూ ట్యూటర్ ప్రశ్న వేశారు. ‘30ఎంఎల్ సర్’ అని తొలుత విద్యార్థి బదులిచ్చాడు. టీచర్ అడిగిన క్వార్టర్ ప్రశ్నకు విద్యార్థి ‘మందు సీసా’కు తగ్గట్టు జవాబు ఇవ్వడం వల్ల అది విన్న అందరూ తెగ నవ్వుకున్నారు. వెంటనే టీచర్ అందుకుని ‘30మిల్లీ లీటర్లా? అరే బాబు.. నేను అడిగేది ఆ క్వార్టర్ గురించి కాదు’ అని కోపంగా చెప్పారు. వెంటనే సరిచేసుకున్న ఆ విద్యార్థి ‘ఫోర్ సర్.. ఫోర్’ అని అనడం వీడియో చివర్లో వినిపించింది. కోపంగా ఉన్న సమయంలో టీచర్ ఇచ్చిన హావభావాలు.. ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో మీమ్స్‌గా దర్శనమిస్తున్నాయి.