Updated : 29 Mar 2022 06:17 IST

Mexico: మెక్సికోలో కాల్పులు.. 19 మంది మృతి..!

మెక్సికో సిటీ: సెంట్రల్‌ మెక్సికోలో దారుణం చోటుచేసుకుంది. మిచోవాకాన్ రాష్ట్రంలో ఓ వేడుకను లక్ష్యంగా చేసుకొని దుండగులు జరిపిన కాల్పుల్లో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 13 మంది పురుషులు, మరో ముగ్గురు మహిళలు ఉన్నారు. ఆ ఘటనలో గాయపడిన మరికొంత మంది క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించినట్లు అక్కడి స్టేట్‌ అటార్నీ జనరల్‌ కార్యాలయం (FGE) వెల్లడించింది. అయితే, కాల్పులకు గల కారణాలపై స్పష్టత లేదని.. దాడులకు పాల్పడిన వారికోసం ముమ్మర గాలింపు చేపట్టినల్లు పేర్కొంది.

మెక్సికోలో లాస్‌ టినాజాన్‌ ప్రాంతంలో ఇటువంటి హింసాత్మక దాడులు సర్వసాధారణమేనని చెప్పవచ్చు. ముఖ్యంగా బార్‌లు, పబ్‌లనే లక్ష్యంగా చేసుకొని ప్రత్యర్థులపై డ్రగ్‌ ముఠాలు దాడులకు పాల్పడుతుంటాయి. సెంట్రల్‌ మెక్సికోలోని లాస్‌ టినాజాస్‌ ప్రాంతంలో పెట్రోల్‌ చోరీ మాఫియా ప్రభావం ఎక్కువ. ప్రభుత్వ ఆయిల్‌ కంపెనీలకు చెందిన పైపులను చోరీ పాల్పడే ఘటనలు కూడా ఎక్కువగా చోటుచేసుకుంటాయి. ఈ క్రమంలో ముఠాల మధ్య దాడులు జరుగుతుంటాయి. తాజా దాడి కూడా లాస్‌ టినాజాన్‌ ప్రాంతంలోనే చోటుచేసుకుంది. ఈ ఘటనలో 19మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన సాయుధ బలగాలు, నిందితుల కోసం గాలింపు చేపట్టాయి.

Read latest Latest News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని