Published : 19 May 2022 13:40 IST

Spam Calls: స్పామ్‌ కాల్స్‌ ఎవరి నుంచి ఎక్కువగా వస్తున్నాయంటే..?

దిల్లీ: దాదాపు ప్రతీ భారతీయుడికి రోజూ ఏదో రకంగా స్పామ్‌ కాల్స్‌, మెసేజ్‌లు వస్తున్నట్లు కాలర్‌ ఐడెంటిఫికేషన్ యాప్ ‘ట్రూకాలర్‌’ వెల్లడించింది. వీటిని అధిగమించడానికి భారతీయులు రెండు మార్గాలను అవలంబిస్తున్నట్లు తెలిపింది. ఇందులో ఒకటి కాలర్‌ను బ్లాక్‌ చేయడం కాగా, కాల్‌ లిఫ్ట్‌ చేసి మళ్లీ చేయవద్దని చెప్పడం మరొకటని పేర్కొంది. దేశవ్యాప్తంగా 37 జిల్లాల్లోని 37 వేల మందిపై ట్రూకాలర్‌ ఈ మేరకు సర్వే నిర్వహించింది. ఇందులో 14 శాతం మంది స్పామ్‌ బెడదను తప్పించుకోవడానికి కాలర్‌ ఐడెంటిఫికేషన్‌ యాప్‌లను వాడుతున్నట్లు తెలిపింది.

అయితే, ఈ సర్వేలో ఏ రకమైన స్పామ్స్‌ ఎక్కువగా స్వీకరిస్తున్నారని అడిగిన ప్రశ్నకు.. 51 శాతం మంది ఆర్థిక సేవలు, విక్రయాలు, ప్రాపర్టీ ఏజెంట్‌ల నుంచి ఈ కాల్స్‌ వస్తున్నట్లు తెలిపారు. అలాగే 8శాతం మందికి ఆరోగ్య సంరక్షణ, బీమా బ్రోకర్లు నుంచి కాల్స్‌ వస్తున్నట్లు తెలిసింది. ఇలా మొత్తంగా దాదాపు ఒక్కొక్కరికి రోజుకు 5-10 స్పామ్‌ కాల్స్‌, మెసేజ్‌లు వస్తున్నాయి. ఒక శాతం మంది మాత్రమే తమకు ఎలాంటి స్పామ్‌ కాల్స్‌ రావట్లేదని సర్వేలో వెల్లడించినట్లు ‘ట్రూ కాలర్‌’ పేర్కొంది.

Read latest Latest News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts