Allu Arjun: నాకు జాతీయ అవార్డు రావాలని ఆయన బలంగా కోరుకున్నారు: అల్లు అర్జున్‌ ఎమోషనల్‌ స్పీచ్‌

జాతీయ అవార్డులు అందుకున్న తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖులకు మైత్రీ మూవీ మేకర్స్ తాజాగా ఓ పార్టీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో పాల్గొన్న అల్లు అర్జున్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Updated : 22 Oct 2023 15:11 IST

హైదరాబాద్‌: ‘పుష్ప ది రైజ్‌’ (Pushpa The Rise) చిత్రానికిగానూ తాను ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకోవడంపై అల్లు అర్జున్‌ (Allu Arjun) ఆనందం వ్యక్తం చేశారు. తన మిత్రుడు దేవిశ్రీ ప్రసాద్‌ (DeviSri Prasad)తో కలిసి అవార్డు తీసుకోవడం సంతోషంగా అనిపించిందన్నారు. ఈ సినిమాలో నటనకు గుర్తింపు రావాలనే ఉద్దేశంతో సుకుమార్‌ ఎంతో శ్రమించారని తాజాగా జరిగిన ఓ పార్టీలో చెప్పారు.

‘‘బాలీవుడ్‌కు వెళ్లమని దేవిశ్రీ ప్రసాద్‌కి ఎన్నోసార్లు చెప్పా. దాదాపు 20 ఏళ్లలో ఎన్నిసార్లు చెప్పానో లెక్కలేదు. నేను ఆ మాట చెప్పిన ప్రతిసారీ.. ‘ముందు నువ్వు వెళ్లు.. నీతో పాటు నేనూ వచ్చేస్తా’ అనేవాడు. అతడి మాటలు విని.. మనకెక్కడ సాధ్యమవుతుందిలే అనుకునేవాడిని. అలాంటిది మేమిద్దరం ఒకేసారి ‘పుష్ప’తో హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాం. అక్కడా మంచి విజయాన్ని అందుకున్నాం. 20 ఏళ్ల నుంచి దేవితో అంటున్న మాట ఇలా నిజమైనందుకు నాకు సంతోషంగా అనిపించింది. జాతీయ అవార్డులకు మా ఇద్దరి పేర్లు ప్రకటించిన నాడు మా నాన్న ఎంతో ఆనందించారు. నా ఇద్దరు కొడుకులకు జాతీయ అవార్డులు వచ్చినట్టు ఉందన్నారు. ‘ప్రిన్సిపల్‌ దగ్గర టీసీలు తీసుకునే మేం.. ప్రెసిడెంట్‌ దగ్గర మెడల్స్‌ తీసుకుంటామని అనుకున్నావా?’ అని ఆయన్ని అడిగా’’

KrishnaRama: వృద్ధాప్య జంట ఫేస్‌బుక్‌లో సెలబ్రిటీ అయితే..

‘‘జీవితంలోని ప్రతి దశలో నేను ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటా. ఏదైనా గట్టిగా కోరుకుంటే అది తప్పకుండా జరుగుతుందని సాధారణంగా మనం అనుకుంటాం. జాతీయ అవార్డు అందుకున్న తర్వాత నాకు తెలిసిన విషయం ఏమిటంటే.. మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్లు కూడా కోరుకుంటేనే ఏదైనా సరే జరుగుతుంది. జాతీయ అవార్డు అందుకోవాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా. కానీ, నాకు అవార్డు రావాలని సుకుమార్‌ మరెంతగానో కోరుకున్నారు. అందుకే నాకు ఈ అవార్డు వచ్చింది. ఆయనే అఛీవర్‌.. నేను కేవలం అఛీవ్‌మెంట్‌ మాత్రమే’’ అని అల్లు అర్జున్‌ తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని