Ashika Ranganath: అప్పటి నుంచి అన్నీ మారిపోయాయి

చాలామంది కన్నడ బుల్లితెర నటీనటులు, వెండితెర నాయకానాయికలు భాష అనే సరిహద్దును చెరిపేసి ఇతర చిత్రపరిశ్రమలోకి అడుగుపెడుతుంటారు. కొవిడ్‌ తర్వాత ఆ తరహాలో టాలీవుడ్‌వైపు ఎందరో మొగ్గు చూపారు.

Updated : 13 Dec 2023 09:30 IST

చాలామంది కన్నడ బుల్లితెర నటీనటులు, వెండితెర నాయకానాయికలు భాష అనే సరిహద్దును చెరిపేసి ఇతర చిత్రపరిశ్రమలోకి అడుగుపెడుతుంటారు. కొవిడ్‌ తర్వాత ఆ తరహాలో టాలీవుడ్‌వైపు ఎందరో మొగ్గు చూపారు. ఇప్పడు ఆ జాబితాలోకి చేరింది కన్నడ కథానాయిక ఆషికా రంగానాథ్‌. ‘అమిగోస్‌’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామ ప్రస్తుతం అగ్రకథానాయకుడు నాగార్జునకి జోడీగా ‘నా సామిరంగ’లో కనిపించనుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆషిక మాట్లాడుతూ...‘కరోనా వచ్చిన సమయంలో అందరూ ఏ మంచి కంటెంట్‌ వచ్చిన వదులుకోలేదు. అప్పటినుంచి అన్నీ మారిపోయాయి. ఇతర సినీపరిశ్రమలో కూడా అడుగుపెట్టారు. నేను కూడా అందులో భాగమే. అలాంటి ప్రయత్నమే చేశాను. నేను నా కెరీర్‌ పరంగా ఎన్ని ప్రయత్నాలు చేయడానికైన సిద్ధమే. నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి, కొత్త అనుభవాల్ని పొందడానికి ఆసక్తి చూపుతాను. ‘అమిగోస్‌’తో తెలుగులో అడుగుపెట్టా. అందులో నా నటన చూసి ‘నా సామిరంగ’కి ఎంపిక చేశారటా’ అని తెలిపింది. ‘సినిమా చిత్రీకరణ సమయంలో కొన్ని తెలుగు పదాలు నేర్చుకున్నాను. కొత్త భాష నేర్చుకోవడం అందమైన అనుభవం. కానీ ఇంక నేర్చుకుంటున్నాను’ అంటూ వ్యాఖ్యల్ని జోడించింది ఆషిక.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని