Bigg boss telugu 7: ఆటలు ఆడకపోయినా అందుకే శివాజీ హౌస్‌లో ఉంటున్నారు: గౌతమ్‌కృష్ణ

హైదరాబాద్‌: ‘బిగ్‌బాస్‌’లో నటుడు శివాజీ మాట మీద నిలబడే మనిషి కాదని హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ అయిన డాక్టర్‌ గౌతమ్‌ కృష్ణ (Gautham krishna) అన్నాడు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

Updated : 04 Dec 2023 15:12 IST

‘‘ఒక విధంగా ‘బిగ్‌బాస్‌ సీజన్‌-7’తోనే (Bigg boss telugu 7) నా జీవితం మొదలైంది. ఇక్కడకు రాకముందు నేనెవరికీ తెలియదు. నాకు (Gautham krishna) ఇండస్ట్రీ నేపథ్యం కూడా లేదు. ఎవరూ సపోర్ట్‌ చేసే వాళ్లు కూడా లేరు. చాలా సమస్యలు దాటుకుని వచ్చాను. ఈ షో ప్రారంభంకాకముందు 8 నెలలు ఖాళీగా ఉన్నా. ఒక రోజు శాండ్‌విచ్‌ తిన్న తర్వాత చూసుకుంటే అకౌంట్‌లో రూ.100 కూడా లేవు. ఆ సమయంలో చాలా బాధగా అనిపించింది. అమ్మానాన్నకు ఫోన్‌ చేసి, అడగాలనిపించలేదు. ఒక ఫ్రెండ్‌కు ఫోన్‌ చేసి, అడిగి తీసుకున్నా. జీవితంలో ఇంకెప్పుడూ ఒకరి దగ్గర చేయిచాచి అడిగే పరిస్థితి లేకుండా చూసుకోవాలనుకున్నా. అనుకోకుండా బిగ్‌బాస్‌ అవకాశం వచ్చింది. ఒక్కో స్టేజ్‌ను దాటుకుని, ఇక్కడి వరకూ వచ్చా. ఇప్పుడు ఎలిమినేట్‌ కావడం వల్ల నేనేమీ బాధపడటం లేదు. కానీ, టాప్‌-5లో ఉంటే బాగుండేది’’

ఎమోషనల్‌గా ఆ డైలాగ్‌ వచ్చేసింది

‘‘ఐదో వారం ఎలిమినేట్‌ అయిన తర్వాత ఇక నా పని అయిపోయిదనుకున్నా. కానీ, నా హౌస్‌లో నా ఆటతీరు నిజాయతీ చూసి, నాగార్జున సర్‌ మరో అవకాశం ఇచ్చారు. తిరిగి హౌస్‌లోకి  వెళ్లినప్పుడు ‘అశ్వాత్థామ’ అంటూ మాట్లాడా. ఆ పేరు అర్థం చావు లేని వాడని. ఫైనల్‌గా చనిపోయా (హౌస్‌లో). ఒకసారి ఎలిమినేట్‌ అయినా కూడా తిరిగి వచ్చా కదా! అందుకు ఆ పేరు నాకు నేను పెట్టుకున్నా. ఆ వారం అందరూ నాకు వ్యతిరేకంగా ఎందుకు నామినేట్‌ చేశారో అర్థం కాలేదు. ఏదైనా గ్రూపిజం చేస్తున్నారా? అనిపించింది. ఇండస్ట్రీలో పెద్దగా ఎవరూ తెలియదు. హౌస్‌లోకి రాకముందు కంటెస్టెంట్‌లలో ఎవరితోనూ పరిచయం లేదు. వెళ్లాల్సిన సమయం వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా ఆ డైలాగ్‌ వచ్చేసింది. నేను (Gautham krishna interview)తిరిగి వస్తానని హౌస్‌లో వాళ్లు కూడా ఎవరూ ఊహించలేదు’’

బయటకు వెళ్లాక శుభశ్రీని కలుస్తా!

‘‘ఎదుటి వ్యక్తి గురించి నాకు ఏదైనా అనిపిస్తే, వెంటనే బయటకు చెప్పను. మనసులోనే పెట్టుకుంటా. అది ఈ హౌస్‌లో నడవదని నాకు అర్థమైంది. నా ఆలోచన దృక్పథం మారింది. నెగెటివ్‌, పాజిటివ్‌ ఏదీ ఆలోచించలేదు. రెండోసారి వచ్చిన తర్వాత ప్రతిదీ కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడా. మొదటి రోజు నుంచే శుభశ్రీ నాకు మంచి ఫ్రెండ్‌ అయింది. బయటకు వెళ్లాక ఆమెను కలుస్తా. అలాగే నైనీ కూడా. నేను డైరెక్ట్‌ చేసిన మూవీ సినిమాటోగ్రాఫర్‌కు నైనీ ఫ్రెండ్‌. (Bigg boss telugu 7) అలా ఆమె గురించి ముందే తెలుసు. కానీ, బయట కలవలేదు. హౌస్‌లో ఉన్నన్ని రోజులు శుభశ్రీతో నిజాయతీగానే మాట్లాడా. ఏ రిలేషన్‌ షిప్‌ అయినా, ఫ్రెండ్‌ షిప్‌తోనే మొదలవుతుంది. అది ఎక్కడి వరకూ వెళ్తుందనేది ఐదు వారాల్లో డిసైడ్‌ చేసేది కాదు. తను వెళ్లేటప్పుడు మాట్లాడేంత సమయం లేదు. ఆమె హౌస్‌లో లేనప్పుడు నేను మాట్లాడితే, అది ఆమెకు నెగెటివ్‌ అవుతుంది. అందుకే ఆమె వెళ్లిన తర్వాత ఒక్కసారి కూడా తన గురించి చర్చ తీసుకురాలేదు’’

శుభశ్రీ విషయంలో అది జరగలేదు

‘‘లెటర్‌ త్యాగం చేసే సమయంలో నేను చాలా ఎమోషనల్‌ అయ్యా. మీరు నన్ను స్వార్థపరుడనుకుంటే దాన్ని అంగీకరిస్తా. అప్పుడు గౌతమ్‌ 1.ఓ ఉన్నాడు. అర్థం చేసుకోలేకపోయాడు. సందర్భం వచ్చినప్పుడు శుభశ్రీకి కృతజ్ఞత చెబుదామనుకున్నా. ఆ సమయానికి ఆమె వెళ్లిపోయింది. నేను లోపలికి వచ్చాక సందీప్‌ మాస్టర్‌ను సేవ్‌ చేశా. నాకు నామినేట్‌ చేసే పవర్‌ ఉన్నా, ప్రియాంక, శివాజీలను నామినేట్‌ చేయలేదు. ప్రతీకారం తీర్చుకోవాలనుకునే ముందు, నాకు సాయం చేసిన వారికి కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండాలన్నది నా ఆలోచన. శుభశ్రీ విషయంలో అది జరగలేదు’’

అందుకే శివాజీ హౌస్‌లో ఉండగలుగుతున్నారేమో!

‘‘శివాజీ’ అన్న మొదటిసారి నన్ను నామినేట్‌ చేస్తూ కొన్ని పాయింట్లు చెప్పారు. ‘గౌతమ్‌ స్థితిమంతుడు. ఒక సినిమా కూడా చేశాడు. బయటకు వెళ్లి ఎలాగైనా బతుకుతాడు. వేరే వాళ్లకు ఈ షో చాలా అవసరం’ అన్నాడు. గతంలో ఓ షూటింగ్‌ సందర్భంగా ఆయన్ను కలిశాను. చాలా మంచి వ్యక్తి. బాగా మాట్లాడారు. కానీ, హౌస్‌లో (Bigg boss telugu 7) ఇలా మాట్లాడే సరికి నాకు మాటలు రాలేదు. నాకు ఎన్ని సమస్యలు ఉన్నాయో ఆయనకు తెలియదు కదా! ‘నేను నీతి, నిజాయతీలతో ఉంటా. నేను సరైన నిర్ణయాలే తీసుకుంటా’ అని ఆయన చెబుతుంటారు. కానీ, ప్రశాంత్‌, యావర్‌లు తప్పు చేస్తే, వాళ్లకు అది తప్పు అని చెప్పరు. అవన్నీ చూసే సరికి నాకు చికాకు వచ్చేసింది. చేయికి దెబ్బ తగిలిన తర్వాత ఆయన ఫిజికల్‌ గేమ్స్‌ పెద్దగా ఆడింది లేదు.

👉Click to follow EENADU WhatsApp channel

ఎక్కువగా సంచాలకుడిగానే చేశారు. ప్రశాంత్‌, యావర్‌లను సపోర్ట్‌ చేయడం ద్వారా ప్రేక్షకుల నుంచి సానుభూతి పొందడం ద్వారా ఇన్ని రోజులు ఉండగలుగుతున్నారేమో. అది ఆయన స్ట్రాటజీ కావచ్చు. ఒకవేళ నేను అనుకుంటున్నది తప్పు కూడా కావచ్చు. ఆయన ఎవరితోనైనా చర్చ పెడతే, ఆయన చెప్పిందే కరెక్ట్‌ అనుకుంటారు. ఎదుటి వ్యక్తి అభిప్రాయాన్ని గౌరవించరు. నేను ఏదైనా మాట్లాడితే ఎవరు నమ్ముతారు చెప్పండి.  ఆ స్థాయి వ్యక్తి మాటలను అందరూ చాలా మంది నమ్ముతారు. అందుకే కరెక్ట్‌గా మాట్లాడాలని అనుకుంటాను. హౌస్‌లోనూ, నాగార్జునగారికి చెప్పలేకపోయిన ఒక మాట ఇక్కడ చెబుతా. శివాజీ అన్న హౌస్‌లో మాట మీద నిలబడే మనిషి కాదు’’

బిగ్‌బాస్‌లో నేను చేసిన గొప్ప పని అదే!

‘‘గేమ్స్‌ లేనప్పుడు అందరూ ఫ్రెండ్స్‌లాగానే ఉంటారు. కానీ, ఏదైనా పాయింట్‌ వచ్చి సపోర్ట్‌ చేయాలంటే అందరూ నాకు వ్యతిరేకంగా ఉంటారు. గేమ్‌లో నా వృత్తిని తీసుకురావడం నాకు నచ్చలేదు. నేను పంచెకట్టుకున్నప్పుడు ప్రశాంత్‌ చేసిన వ్యాఖ్యలు కూడా నచ్చలేదు. అలాగే యావర్‌ విషయంలో నేను మాట్లాడింది కూడా తప్పు అని ఒప్పుకొంటా. అమర్‌లో కొన్ని మైనస్‌లు ఉన్నాయి. అతడి వల్ల ప్రియాంక ఆట చెడిపోతోంది. ఎందుకంటే ప్రియాంక నాకు పాయింట్స్‌ ఇచ్చిన తర్వాత నీకు అలాంటి పరిస్థితి వస్తే, అమర్‌కు పాయింట్స్‌ ఇవ్వమని పదే పదే చెప్పింది. అమర్‌ వచ్చి ప్రియాంకను అదే పనిగా అడగడం వల్లే అలా చేసింది. ఒకవేళ ప్రియాంక నాకు పాయింట్స్‌ ఇవ్వకపోతే, నేను వేరే రకంగా ఆలోచించేవాడిని.  నేను కెప్టెన్‌గా ఉన్నప్పుడు లేడీస్‌ వీక్‌ అని పెట్టాను. మహిళా ఫాలోయింగ్‌ కోసం మాత్రం ఆ పనిచేయలేదు.  ఈ బిగ్‌బాస్‌ హౌస్‌లో నేను ఏదైనా గొప్ప పనిచేశానంటే అది మహిళల వారం’’

  • గౌతమ్‌ దృష్టిలో  బిగ్‌బాస్‌ హౌస్‌లో ముందుకు వెళ్లేది ఎవరు? ముగిసిపోయేది ఎవరు?
  • అర్జున్‌: ఫిజికల్‌ గేమ్‌ బాగా ఆడతున్నాడు. హౌస్‌మేట్స్‌తో కలిసి ఉంటే బాగుంటుంది.
  • ప్రియాంక: తన సపోర్ట్‌ చేసినా చేయకపోయినా ఆమెతో అనుబంధం ఏర్పడింది. టాప్‌-5లో ఉంటుంది
  • శివాజీ: కొన్ని తప్పులు ఉన్నాయి. కానీ, మైండ్‌ గేమ్ ఆడుతున్నాడు. అందుకే ఫిజికల్‌ గేమ్స్‌ ఆడకపోయినా ఉండగలుగుతున్నారు. అదే ఆయనను గెలిపించే అవకాశం ఉంది. టాప్‌-5లో ఉంటారు.
  • పల్లవి ప్రశాంత్‌: మంచి అబ్బాయి. శివాజీ అన్న ఏది చెబితే అది ఫాలో అవుతాడు. అలా చేయకుండా ఉంటే బాగుంటుంది.
  • యావర్‌: ఎమోషనల్‌ వ్యక్తి. బయటకు వచ్చాక ఇద్దరం కలిసి ట్రిప్‌నకు వెళ్తాం
  • అమర్‌: అందరి దగ్గరి నుంచి ఏదో ఒకటి ఆశిస్తూ ఉంటాడు. వ్యక్తిగతంగా ఆడుతున్నప్పుడు అది మంచిది కాదు. టాప్‌-5కు వెళ్లడు.
  • శోభ: నెగెటివిటీ ఎక్కువ. టాప్‌-5కు వెళ్లదు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని