Updated : 24/11/2021 15:17 IST

Sai Pallavi Sister: హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న సాయిపల్లవి సోదరి

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ నటి, డ్యాన్సర్‌ సాయిపల్లవి చెల్లెలు పూజా కన్నన్‌ హీరోయిన్‌గా తెరంగేట్రం చేయనుంది! ‘జీ5’ ఓటీటీలో డిసెంబర్‌ 3న విడుదల కానున్న తమిళ చిత్రం ‘చిత్తిరై సేవానమ్‌’ ద్వారా ఆమె ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఇదే విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించింది . ‘‘చాలా కాలం నుంచి ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నా. డిసెంబర్‌ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కొంచెం నెర్వస్‌గా ఉంది. సినిమాలో నా పాత్ర పోషించేటప్పుడు వరకూ ఎంత ఎంజాయ్‌ చేశానో...అదే రీతిలో మీరు నా నటనను ఎంజాయ్‌ చేస్తారని భావిస్తున్నా. నన్ను ఆశీర్వదించండి’’ అంటూ ఆ సినిమా పోస్టర్‌ని విడుదల చేశారు.  

శిల్వ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను అగ్రకథానాయకుడు ధనుష్‌ ట్విటర్‌లో విడుదల చేశారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఓ తండ్రీ కూతురి కథ అన్నట్లుగా మోషన్‌ పోస్టర్‌ ఆధారంగా తెలుస్తోంది. ఇందులో పూజకి తండ్రిగా ప్రముఖ నటుడు సముద్రఖని నటించారు. జీ తమిళ్‌, అమిర్తా, థింగ్‌ బిగ్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. సామ్‌ సీఎస్‌ స్వరాలు సమకూర్చారు. దర్శకుడు ఎ.ఎల్‌ విజయ్‌ దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన పూజ.. 2017లో విడుదలైన తమిళ షార్ట్‌ఫిల్మ్‌ ‘కారా’లో నటించింది.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని