Deepika Padukone: ఆ రోజు తప్పనిసరై వెళ్లాం.. అయితే తప్పేంటి?

స్నేహితుల్లో మంచి చెడు చెప్పుకోవడమే కాదు.. అప్పుడప్పుడు చేసే సరదా చిలిపి చేష్టలు ఎప్పటికీ గుర్తిండిపోతాయి. అంతేనా... నవ్వు కూడా తెప్పిస్తాయి. సరిగ్గా అలాంటి ఓ సరదా సంఘటనే...

Published : 31 Jan 2022 01:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్నేహితుల్లో మంచి చెడు చెప్పుకోవడమే కాదు.. అప్పుడప్పుడు చేసే సరదా చిలిపి చేష్టలు ఎప్పటికీ గుర్తిండిపోతాయి. అంతేనా... నవ్వు కూడా తెప్పిస్తాయి. సరిగ్గా అలాంటి ఓ సరదా సంఘటనే జరిగిందట బాలీవుడ్‌ భామలు దీపికా పదుకొణె, అలియా భట్‌ జీవితాల్లో. ప్రస్తుతం ‘గెహ్రాహియా’ చిత్రం ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు ఆ చిత్ర నటీనటులు దీపికా, అనన్యా పాండే, సిద్దార్థ్‌ చతుర్వేది. ఆ ప్రచార కార్యక్రమంలో యాంకర్‌ దీపిక, అనన్యలకు ఊహించని ప్రశ్న వేయగా.. ప్రేక్షకుల్లో ఎలా సమాధానమిస్తారనే ఆత్రుత మొదలైంది.

‘‘ఎప్పుడైనా మీరు పురుషుల వాష్‌రూమ్‌కి వెళ్లారా’’ అని అడగగా..‘‘చూడటానికి పరిశుభ్రంగా అనిపిస్తే కచ్చితంగా వెళ్తా’’ అని అనన్య బదులిచ్చింది. బహుశా దీపిక అలా మెన్స్‌ వాష్‌రూమ్‌కి ఎప్పటికీ వెళ్లకపోవచ్చు అని హీరో సిద్దార్థ్‌ చతుర్వేది తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈలోపు దీపిక ఎవరికీ తెలియని విషయాన్ని పంచుకుంది. ఊహించని పరిస్థితుల్లో మెన్స్‌వాష్‌ రూమ్‌కి వెళ్లాల్సి వస్తే కచ్చితంగా వెళ్తా. వాస్తవానికి అలాంటి ఓ సంఘటన నా జీవితంలో జరిగింది. నిజానికి ఒకానొకొక సందర్భంలో మెన్స్‌ వాష్‌రూమ్‌కి వెళ్లాల్సి వచ్చింది. ఓ సారి బెర్లిన్‌లో జరిగిన మ్యూజికల్‌ కోల్డ్‌ప్లే కన్సర్ట్‌కి నేనూ, అలియాభట్‌ వెళ్లాం. షో అయ్యాక వాష్‌రూమ్‌కి వెళ్దామనుకుంటే ఉమెన్స్‌ వాష్‌రూమ్‌ వద్ద పెద్ద క్యూ ఉంది. ఇక చేసేది లేక ఇద్దరం మెన్స్‌ వాష్‌రూమ్‌కి వెళ్లాం. అలాంటి సందర్భాల్లో.. అది మెన్స్‌ వాష్‌రూమా.. వాష్‌రూమ్‌ క్లీన్‌గా ఉందా? లేదా? అని అనేది విషయం కాదు. ఎలాంటి పరిస్థితి అయినా నేను, అలియా మాత్రం ‘‘పార్టర్న్స్‌ ఇన్‌ క్రైమ్‌’’ అని ఆరోజు జరిగిన సంఘటనను పంచుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని