Bobby deol: నాగార్జునతో బాబీ దేవోల్‌ ఢీ!

‘కుబేర’ తర్వాత నాగార్జున చేయనున్న చిత్రంపై ఇప్పటికే స్పష్టత వచ్చింది. ఆయన స్టూడియో గ్రీన్‌ పతాకంపై తమిళ దర్శకుడు నవీన్‌తో ఓ సినిమా చేయనున్నారు.

Updated : 30 Apr 2024 09:36 IST

కుబేర’ తర్వాత నాగార్జున చేయనున్న చిత్రంపై ఇప్పటికే స్పష్టత వచ్చింది. ఆయన స్టూడియో గ్రీన్‌ పతాకంపై తమిళ దర్శకుడు నవీన్‌తో ఓ సినిమా చేయనున్నారు. భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ముస్తాబు కానున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు బాబీ దేవోల్‌ ఓ ప్రధాన పాత్ర పోషించనున్నారని సమాచారం. ఆయన నాగ్‌ను ఢీ కొట్టే ప్రతినాయకుడిగా శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారని తెలిసింది. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని.. సినిమా జూన్‌ నెలాఖరు నుంచి చిత్రీకరణనువ ప్రారంభించుకోనుందని చిత్ర సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ చిత్రంలో నాగ్‌కు జోడీగా ఇద్దరు కథానాయికలు కనిపించనున్నారు. మరి ఆ అవకాశం ఎవరికి దక్కుతుందో తేలాల్సి ఉంది.


పిడుగు సిద్ధమైంది

నాగార్జున, ధనుష్‌ ప్రధాన పాత్రల్లో శేఖర్‌ కమ్ముల తెరకెక్కిస్తున్న చిత్రం ‘కుబేర’. సునీల్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌ మోహన్‌రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రష్మిక కథానాయిక. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా నుంచి ఈ నెల 2న ఓ ప్రచార చిత్రం విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం సోమవారం ప్రకటించింది. ‘‘ఓ భారీ పిడుగును సీజ్‌ చేసి లోడ్‌ చేయడం జరిగింద’’ని చిత్ర నిర్మాణ సంస్థ సామాజిక మాధ్యమాల్లో రాసుకొచ్చింది. దీన్ని బట్టి ఈ సినిమా నుంచి ఓ వీడియో గ్లింప్స్‌ బయటకు రానున్నట్లు అర్థమవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని