మరోసారి ఆ హిట్‌ కాంబినేషన్‌..?

హీరోను మాస్‌కు మరింత దగ్గర చేసే దర్శకుల్లో బి.గోపాల్‌ ఒకరు. ఇక అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణకు మాస్‌లో ఉన్న ఇమేజ్‌

Published : 07 Jan 2020 21:53 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: హీరోను మాస్‌కు మరింత దగ్గర చేసే దర్శకుల్లో బి.గోపాల్‌ ఒకరు. ఇక అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణకు మాస్‌లో ఉన్న ఇమేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రాబోతోందా? అంటే టాలీవుడ్‌ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. 

గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన, ‘లారీ డ్రైవర్‌‘, ‘రౌడీ ఇన్‌స్పెక్టర్‌’, ‘సమరసింహారెడ్డి’, ‘నరసింహనాయుడు’, చిత్రాలు బాక్పాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాయి. ముఖ్యంగా ‘సమర సింహారెడ్డి’, ‘నరసింహనాయుడు’ చిత్రాలు టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే.  ప్రస్తుతం బాలయ్య.. బోయపాటి దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా మరో చిత్రానికి బాలయ్య సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా పలు కథలను వింటున్నారట. అలా  ఒక కథ బాలయ్యకు తెగ నచ్చేసిందట. మాస్‌ యాక్షన్‌లో సాగే ఆ కథకు తెరరూపం ఇవ్వడానికి బి.గోపాల్‌ అయితే బావుంటుందని భావిస్తున్నారట. ఆయనతో చర్చలు జరిపి త్వరలోనే ఓ నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తోంది. 2003లో చివరిసారి ‘పల్నాటి బ్రహ్మనాయుడు’కోసం బి.గోపాల్‌-బాలకృష్ణ కలిసి పనిచేశారు. మళ్లీ ఇప్పుడు కలిసి పనిచేస్తారో? లేదో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక 2017లో గోపీచంద్‌ కథానాయకుడిగా ‘ఆరడగుల బుల్లెట్‌’ తెరకెక్కించిన గోపాల్‌ ఆ తర్వాత మరో చిత్రం తీయలేదు. మరి బాలయ్య డైరెక్ట్‌ చేసే అవకాశం అందుకుంటారో లేదో చూడాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని