కల్యాణ్‌రామ్‌ సినిమా... ‘ఎమిగోస్‌’?

మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై కల్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. రాజేంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నవీన్‌ యెర్నేని, యలమంచిలి రవిశంకర్‌ నిర్మాతలు. కల్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా నటిస్తున్న 19వ

Published : 02 May 2021 13:14 IST

మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై కల్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. రాజేంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నవీన్‌ యెర్నేని, యలమంచిలి రవిశంకర్‌ నిర్మాతలు. కల్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా నటిస్తున్న 19వ సినిమా ఇది. దీనికి ‘ఎమిగోస్‌’ అనే పేరుని పరిశీలిస్తున్నట్టు సమాచారం. ‘ఎమిగోస్‌’ అంటే తెలుగులో స్నేహితులు అని అర్థం. ఈ చిత్రంలో కల్యాణ్‌రామ్‌ మూడు పాత్రల్లో కనిపిస్తారని ప్రచారం సాగుతోంది. మరి మూడు పాత్రలా లేక, రెండు పాత్రలా అనేది తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే. కథానాయిక ఎంపికపై కూడా కసరత్తు చేస్తోంది చిత్రబృందం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని